రామకృష్ణాపూర్,జనవరి 19, నేటిధాత్రి:
ఈనెల 22న అయోధ్యలో జరగబోయే శ్రీరాముని ప్రాణ ప్రతిష్టాపనలో భాగంగా రామకృష్ణాపూర్ పట్టణంలోని గడపగడపకు జైశ్రీరామ్ అనే నామం ఉండాలనే ఉద్దేశంతో మహంకాళి టెంపుల్ ఆధ్వర్యంలో గడపగడపకు జైశ్రీరామ్ అని రాయించడం జరిగిందని మహంకాళి టెంపుల్ ఆర్గనైజర్ నిమ్మల సాయికుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు. గత మూడు రోజులుగా పట్టణంలోని గడపగడపకు జైశ్రీరామ్ అని రాపిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో సంపత్, రవీందర్, రామ్ కిషోర్, హరిప్రసాద్ ,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
