ఈరోజు కాళోజి స్తూపం వద్ద ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో వరంగల్ ఉమ్మడి జిల్లా మున్నూరు కాపు సంఘం మరియు రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు పద్మశాలి సంఘం వివిధ కులాలకు సంబంధించిన సంఘ నాయకులు పాల్గొన్న రూ మున్నూరు కాపు బిడ్డ, మాజీ పీసీసీ చీఫ్ పొన్నాలకు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి*.:::: * వరంగల్ ఉమ్మడి జిల్లాల మున్నూరు కాపు సంఘం బీసీ సంఘం నాయకులు . ✊✊✊ మున్నూరు కాపు పెద్దలు, జనగామ నియోజకవర్గం నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, నలుగురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసిన అనుభవం కలిగి, తెలంగాణ పిసిసి తొలి అధ్యక్షులు నియమితులై తన జీవితాన్ని కాంగ్రెస్ పార్టీకి అంకితం చేసి 45 సంవత్సరాలుగా రాజకీయం అనుభవం కలిగిన పొన్నాల లక్ష్మయ్య గారిని పొమ్మనకుండా పొగ పెట్టి ఆయనను తీవ్ర మనోవేదనకు గురిచేసి , ఆయన బాధ తప్ప హృదయంతో రాజీనామా చేసిన సందర్భంలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పొన్నాల పట్ల చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ దురంకారానికి, కుల అహంకారానికి నిదర్శనంగా ఉన్నాయని, ఆయన చేసిన వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకొని పొన్నాల గారికి క్షమాపణలు చెప్పాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా మున్నూరు కాపు సంఘం బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని మున్నూరు కాపు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కటకం పెంటయ్య గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొనగాని యాదగిరి గౌడ్ బూర విద్యాసాగర్ మున్నూరు కాపు సంఘం పశ్చిమ కోఆర్డినేటర్ కనుకుంట్ల రవికుమార్ శ్యామ్ యాదవ్ నడుములవిజయ్ కుమార్ ముదిరాజ్ యుగంధర్ రాజ్ కుమార్ రజక రాష్ట్ర కార్యదర్శి పేరుకారి శ్రీధర్ కార్పొరేటర్ చెన్నం మధు మాడిశెట్టి వరుణ్ అడ్వకేట్ వినోద్ వివిధ కుల సంఘం నాయకులు పాల్గొన్నారు .
తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపు సంఘం రాజకీయాలకతీతంగా పనిచేస్తుందని ఏ రాజకీయ పార్టీలోనైనా సరే మా మున్నూరు కాపు బిడ్డలకు అన్యాయం జరిగిన, అవమానాలు జరిగిన సహిస్తూ ఊరుకోమని వారికి న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని ఆయన అన్నారు. నేడు పొన్నాలకు జరిగిన అవమానాన్ని మా యావత్ మున్నూరు కాపు జాతికి జరిగిన అవమానంగా మేము భావిస్తున్నామని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని . సీనియర్ నాయకుల పట్ల గౌరవ మర్యాదలతో వ్యవహరిస్తూ వారి అనుభవాలను సూచనలను సలహాలను పాటించడం వివేకవంతమైన వారి లక్షణమని అన్నారు. వెంటనే పొన్నాలకు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పని పక్షంలో రాష్ట్రవ్యాప్త కార్యాచరణ రూపొందిస్తామని తెలియజేస్తున్నాము *మున్నూరు కాపు సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా *✊✊✊