కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్” యాత్ర మండల సన్నాహక సమావేశం
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు రామడుగు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జవ్వాజి హరీష్ (మాజీ ఎంపీపీ) ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ పరిరక్షణకై నిర్వహించే “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్” యాత్ర మండల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం పట్ల, అంబేద్కర్ పట్ల కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సహా బిజెపి నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై నిరసనగా కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఈకార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ప్రతీ గడపగడపకి ఇట్టి విషయాన్ని తీసుకెళ్లి దేశాన్ని ముక్కలు చేయాలన్న ఆలోచన బిజెపి నాయకుల ఆలోచన విధానాన్ని, వారు దేశ భద్రతపై చేస్తున్న అంతర్గత దాడిని వివరించాలన్నారు. మండల కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధులు ఇట్టి పాదయాత్రలో పాల్గొని రాబోవు రోజుల్లో పార్టీ పటిష్టతకు కృషి చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో రామడుగు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జవ్వాజి హరీష్ (మాజీ ఎంపీపీ), కరీంనగర్ జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్, మాజీ సర్పంచ్ కోల రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి పంజాల శ్రీనివాస్ గౌడ్, మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మరవేణి తిరుపతి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అనుపురం పర్శరాంగౌడ్, శ్యాంసుందర్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు తోట రవి, కర్ణ శీను, లచ్చయ్య, కనకయ్య, స్వామి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.