కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం.
చిట్యాల, నేటి ధాత్రి :
చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం మండలం లోని దూత్ పెల్లి గ్రామంలో ఇన్చార్జి బానోత్ కిషన్ నాయక్* ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించడం జరిగింది…. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల ఇన్చార్జి బానోత్ కిషన్ నాయక్ మరియు మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి మాట్లాడుతూ ఈ దేశంలో మతోన్మాద బిజెపి పార్టీ భారత రాజ్యాంగాన్ని కూనిచేస్తూ రాజ్యాంగ విలువలను మంట కలుపుతూ దళితులు ,అట్టడుగు వర్గాలపై దాడులు ,దౌర్జన్యాలు చేస్తూ అధికారంలోకి వచ్చి నిండు పార్లమెంట్ సభలో అమిత్ షా రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకొని భారత జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే దేశ స్వాతంత్రం కోసం ఈ దేశ ఆర్థిక అభివృద్ధి కోసం 75 సంవత్సరాల స్వాతంత్రం సిద్ధించిన తరుణంలో అనేక మార్పులు తీసుకొచ్చి ఈ దేశానికి ఎన్నో సేవలు కాంగ్రెస్ పార్టీ మహా నాయకులు అందించారుఅని స్వాతంత్రం తీసుకొచ్చినదేశ పరిపాలనలో అసువులు బాసిన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ లాంటివారు ప్రజల కోసం ప్రజాసేవలో కొనసాగుతూ అమరులైనటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి ఘనత సోనియాగాంధీ కి దక్కింది 10 సంవత్సరాల టిఆర్ఎస్ పరిపాలనను తుంగలో తొక్కి ఈ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించి అనేక సంక్షేమ పథకాలను అనుభవిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటిలన్నింటిని అమలు చేసి రాష్ట్ర ప్రజల మన్నలను పొందుతున్న సందర్భంలో రాహుల్ గాంధీ తీసుకున్నటువంటి నిర్ణయం జై బాబు జై భీమ్ జై సౌంవిధాన్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో ప్రతి గడపగడపకు కాంగ్రెస్ పార్టీ బాపు వారసుల త్యాగ ఫలితాలను అంబేడ్కర్ వాదాన్ని ప్రజల్లోకి ప్రతి కార్యకర్త నాయకులు తీసుకెళ్లి భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు..ఈ కార్యక్రమంలో చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి గారు,చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి సత్యనారాయణ జిల్లా ప్రధాన కార్యదర్శి ముకిరాల మధుర వంశీ కృష్ణ , జిల్లా అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య ,కార్యదర్శి రాయకమురు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మూలశంకర్ గౌడ్ , యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అల్లకొండ కుమార్, సేవాదళ్ జిల్లా అధ్యక్షులు ఏకు రవీందర్ ,ఎస్సీ ఎస్టీ బీసీ సెల్ మండల అధ్యక్షులు బొట్ల రవి ,నందరాజు, బుర్ర శ్రీనివాస్ గౌడ్ , యూత్ నాయకులు గోపగాని శివ, నాగరాజు, శ్రీకాంత్, ముష్కే నాగరాజు యూత్ నాయకులు, మహిళా కార్యకర్తలు, పాల్గొన్నారు.