
భక్తులతో కిటకిటలాడుతున్న దుకాణాలు
మందమర్రి, నేటిధాత్రి:-
రెండేళ్లకోసారి వచ్చే సమ్మక్క – సారలమ్మ వనదేవతల జాతరను పురస్కరించుకొని భక్తులు వన దేవతలకు నిలువెత్తు బంగారం (బెల్లం) తూకం వేయించి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకుంటున్నారు. గత 15 రోజులుగా పట్టణంతో పాటు కోల్ బెల్ట్ ప్రాంతాలైన బెల్లంపల్లి మందమర్రి, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్ తదితర ప్రాంతాల్లో బెల్లం కొనుగోలుదారులతో దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. రెండేళ్ల కోసారి వచ్చే జాతరను పురస్కరించుకొని అమ్మవార్ల మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో బెల్లం తూకాలతో కోల్ బెల్ట్ ప్రాంతాల్లోని దుకాణాలు కల లాడుతున్నాయి. మాఘ శుద్ధ పూర్ణిమ కు ముందు అమ్మ వార్లకు ఎత్తు బెల్లాలను సమర్పించి జంతు బలులతో పూజలు నిర్వహించిన అనంతరం పౌర్ణిమ రోజు జరిగే జాతరకు తరలి వెళ్ళి వనదేవత లకు మొక్కులు తీర్చుకుంటారు. వన దేవతలను దర్శించుకునేందుకు భక్తులు ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క – సారలమ్మ జాతరకు తరలి వెళ్లనుండగా అంత దూరం వెళ్లలేని వారు స్థానికంగా నిర్వహించే జాతరకు తరలి వెళ్ళి వనదేవత లను దర్షినుకుంటారు. ఎదిమైనప్పటికి వన దేవతల జాతర కోసం అమ్మవార్లకు నిలువెత్తు బంగారం ( బెల్లం) లతో మొక్కులు తీర్చుకావడంతో బెల్లం అమ్మకాలతో దుకాణాలు కళకళ లాడుతున్నాయి.
మాంసం ఆమ్మకాలు సైతం……
వన దేవతల జాతరలో జంతు బలి తప్పని సరి కావడంతో మాంసం దుకాణాలు కలలాడుతున్నయి. రెండేళ్లకోసారి వచ్చే సమ్మక్క – సారలమ్మ జాతర సందర్భంగా భక్తులు ఖర్చుకు వెనుకాడకుండా మేకలు, కోళ్ళ తో అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు