జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితిపై అనుమానంగా ఉంది
తిరుపతి నేటిధాత్రి :
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితిపై అనుమానంగా ఉందని జిల్లా బీజేపీ అధ్యక్షులు సామంచి శ్రీనివాసులు అన్నారు. గురువారం స్థానిక తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…
జగన్మోహన్ రెడ్డికి అసలేమైంది ఆయన మానసిక స్థితిపై వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
అధికారంలో ఉన్నప్పుడు అందరినీ మోసం చేసి ప్యాలెస్ కు పరిమితమై, పరదాల ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకొన్న తానేం చేశారో గుర్తు చేసుకోవాలన్నారు.తనను వీడి వెళ్ళిపోతున్న ఎమ్మెల్యేలను, కార్పొరేటర్లను బ్రతిమాలుతున్న జగన్ డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తిని కార్పొరేటర్ తో పోల్చడం అవివేకమన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించి సర్పంచులకు నిధులిచ్చి విధులు ఇచ్చి గౌరవిస్తుంటే, ఆదర్శ రాజకీయ నేతగా ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పవన్ కళ్యాణ్ ను జగన్మోహన్ రెడ్డి విమర్శించడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేసారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు
పొనగంటి భాస్కర్,వర ప్రసాద్,నవీన్ కూమార్ రెడ్డి,డాక్టర్ శ్రీహరి రావు,దీపక్ యాదవ్,నవీన్ రాయల్,ప్రసాద్, రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు..