`అంజనా టౌన్ షిప్ మూసేసిన దారి?
`జమ్మికుంటలో జగజ్జంత్రి భూ మాయాజాలం!
`దారి మూసి అంజనా అక్రమ దందా!
`దారి మూసి.. వరినాట్లేసి..
`అంజనా టౌన్ షిప్ కబ్జా కహాని!
`అధికారులకు పట్టదు.. దళితుల గోడు వినరు?
`లోకా యుక్త ఆదేశాలు పాటించరు?
`మీడియాలో వార్తలు వస్తే నాలుగు రోజులు హడావుడి!
`అధికారులు వచ్చి హద్దులు పాతేస్తారు?
`యధావిధిగా నాలుగు రోజులకు వెంచర్ నిర్వాహకులు తొలగిస్తారు?
`అదేమిటని ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతారు?
`ప్రాణాలు తెస్తామని హెచ్చరిస్తుంటారు?
`దళితులకు న్యాయం చేసేదేవరు?
`రాజకీయ ముసుగులో అక్రమ దందా చేస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారు?
`మూడేళ్లుగా అధికారులు పదే పదే హద్దులు పాతుతున్నారు?
`హద్దులు తొలగించిన వారి మీద కేసులు ఎందుకు నమోదు చేయడం లేదు?
`ఎవరు ఎవరితో కుమ్మక్కు అవుతున్నారు?
`అంజనా టౌన్ షిప్ కు అనుమతి 9 ఎకరాల, 30 గుంటలు మాత్రమే.
`సర్వే నంబర్లు 94, 95,100 లో మాత్రమే అనుమతి వుంది?
`103 సర్వే నంబర్ భూమిని టౌన్ షిప్ లో కలిపేసుకున్నారు?
`ప్లాట్లు చేసి అమ్మేసుకున్నారు.. దారి మూసి భూ దోపిడీ చేశారు?
`అందులో గ్రామ నక్షా బాట వుంది.
`అమాయకులను మోసం చేసి అంటగట్టారు!
`అధికారులకు తెలిసినా చర్యలు తీసుకోవడం లేదు!
`తూ తూ మంత్రంగా ప్రకటనలు చేసి చేతులు దులుపుకుంటున్నారు!
హైదరాబాద్, నేటిధాత్రి:
నమ్మకం ముసుగులో నాటకాలు, అమ్మకం ముసుగులో అరాచకాలు బాగా అýవాటు చేసుకుంటున్నారు. రియల్ వ్యాపారమంటేనే మోసం అని రుజువు చేస్తున్నారు. రాజకీయ నాయకులు మరీ దిగజారిపోతున్నారు. అక్రమ సంపాదనలకు తెగబడుతున్నారు. ఓ వైపు ప్రజా ప్రతినిధులై సేవ చేస్తామంటారు. ప్రజలకు కష్టం రాకుండా పాలిస్తామంటారు. కాని ప్రజలను వంచించే మోసాలు చేస్తున్నారు. రియల్ వ్యాపారాలు మొదలు పెట్టి జనానికే కుచ్చు టోపి పెడుతున్నారు. పైసా పైసా కూడబెట్టుకొని సొంతింటి కల నెరవేర్చుకుందానకునే పేదల జీవితాలతో ఆడుకుంటున్నారు. జీవిత కాలం ఆ కల నెరవేరకుండా చేస్తున్నారు. నమ్మకంగా సాగాల్సిన వ్యాపారంలో అవకతవకలు చేస్తున్నారు. నాయకుడని నమ్మినందుకు నట్టెట ముంచేస్తున్నారు. ఎన్నికల నాడు దళితులకు అండగావుంటామంటారు. వారికి రక్షణగా వుంటామని మాట ఇస్తారు. కాని గెలిచిన తర్వాత మొదట అన్యాయం ఆ దళితులకే చేస్తారు. ఆ దళితుల జీవితాలతోనే ఆడుకుంటుంటారు. రాజకీయాలలో ఓట్లు కొని గెలుస్తుంటారు. వ్యాపారాలు చేసి ప్రజలను మోసం చేసి కోట్లు కూడబెట్టుకుంటారు. ఒకప్ప్పుడు వ్యాపారులే రియల్ వ్యాపారం సాగించేవారు. ఆ రియల్ వ్యాపారులు ప్రజలకు ఏదైనా అన్యాయం చేస్తే నాయకులు కాపాడుతుండేవారు. కాని ఇప్ప్పుడు వ్యాపారులు కనుమరుగైపోయారు. నాయకులే వ్యాపారుల అవతారం ఎత్తుతున్నారు. న్యాయం చేయాల్సిన నాయకులే అన్యాయం చేస్తున్నారు. ప్రజలు తమ గోడును చెప్ప్పుకునే దిక్కులేకుండా చేస్తున్నారు. ఒకప్ప్పుడు అధికారులు తప్ప్పు చేసినా నాయకులే కాపాడుతుండేవారు. ఇప్ప్పుడు నాయకులే తప్ప్పు చేస్తుంటే అధికారులు వెనకేసుకొస్తున్నారు. మొత్తం మీద అటు అధికారులు, ఇటు నాయకులు కలసి జనాన్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు. పేద వారిని మాట లేకుండా చేస్తున్నారు. పేదల జీవితాలను చిదిమేస్తున్నారు. సరిగ్గా అలాంటిదే ఈ సంఘటన. నాయకులంటే అదికారులకు హడల్..అందుకే వారికే అండదండలు కల్పిస్తుంటారు. నాయకులకు ఇబ్బందులు రాకుండా కొమ్ము కాస్తుంటారు. ఇక్కడా అదే జరుగుతోంది. నాయకుడి సేవలో తరించేందుకు ఏకంగా మ్యాపులే అధికారులు మాయం చేశారంటే సామాన్యమైన విషయం కాదు. ప్రభుత్వ రికార్డులను కూడా మాయం చేసి, నాయకుడి వ్యాపారానికి అండగా నిలవడం జమ్మికుంటలో కలకలరం రేపుతోంది. కరీంనగర్‌కు చెందిన ఓ బడా నాయకుడు జమ్మికుంట శివారులో వున్న ధర్మారం పరిధిలో ఓ వెంచర్ ఏర్పాటు చేశారు. ఇంత వరకు బాగానే వుంది. ఆ వెంచర్ వుండాల్సింది కేవలం 9 ఎకరాల 30 గుంటలు మాత్రమే. ఆ సర్వేనెంబర్లు 94,95,100. కాని అదనంగా ఈ వెంచర్లోకి 103 సర్వే నెంబర్ వచ్చి చేరింది. ఇదెలా సాద్యమైందో అధికారులే చెప్పాలి. ఈ వెంచర్ కోసం రిజిస్ట్రేషన్ జరిగింది మూడు సర్వేనెంబర్లే అయితే నాలుగో సర్వే నెంబర్ ఎలా చేరిందన్న దానిపై ఏ అధికారి పట్టించుకున్న పాపాన పోలేదు. కొంత మంది ఆ అక్రమ వెంచర్ మీద మూడేళ్లుగా ప్రజా పోరాటం చేస్తున్నారు. 103 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి. అందులో బాట వుంది. కొన్ని శతాబ్దాలుగా ఆ బాటను రైతులు వినియోగించుకుంటున్నారు. ఆ వెంచర్‌కు కొంత దూరంలో దళిత వాడ వుంది. ఆ వాడకు వెళ్లడానికి శతాబ్దాలుగా దళితులు ఆ బాటనే నడుస్తున్నారు. కాని వెంచర్ ముసుగులో ఆ బాటను అంజనా వెంచర్ నిర్వాహకులు మూసి వేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారు. భయపెడుతున్నారు. ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అయినా కొంత మంది ధైర్యం చేసి లోకాయుక్తను ఆశ్రయించారు. అప్ప్పుడు కదిలిన యంత్రాంగం రంగంలోకి దిగినట్లే దిగింది. హడావుడి చేసింది. మళ్లీ ఆ వెంచర్ పెద్దలకు వంత పాడింది. జనం ముందు ఒక మాట చెబుతున్నారు. నాయకుడికి మాటకు నో చెప్పకుండా వుంటున్నారు. గ్రామ నక్ష ప్రకారం వున్న భూమిని ఆక్రమించడమేమిటని అనేక మంది ప్రశ్నిస్తున్నా అధికారులకు చీమ కుట్టినట్లు కూడా కావడం లేదు. పేదలకు న్యాయం చేయాలన్న సోయి రావడం లేదు. జనం ఒత్తిడిని తట్టుకోలేక, లోకాయుక్త ఆదేశాలతో ఒకటి రెండుసార్లు ఆ బాటకు అధికారులు హద్దులు పాతారు. కాని ఏం జరిగింది. అటు అధికారులు హద్దులు పాతడం, మరునాడు వెంచర్ నిర్వాహకులు వాటిని తొలగిండచం కామనైపోయింది. ఆ బాట వుందన్న విషయాన్ని గతంలోనే అధికార గణం నిర్దారణ చేసింది. 9 ఎకరాల్సిన వెంచర్లోకి 103 సర్వే నెంబర్‌ను కలిపేసుకొని 11 ఎకరాల 4 గుంటలు లేఅవుట్ పర్మిషన్ వుందని అబద్దాలు ప్రచారం చేశారు. అదికారులు కూడా ఆ వెంచర్ అధినేతతో చేతులు కలిపారన్న ఆరోపణలు అనేకం వున్నా స్పందన లేదు. విచిత్రమేమిటంటే అక్రమంగా ఆక్రమించిన 103 సర్వే నెంబర్ భూమిలో కూడా ఆ వెంచర్ నిర్వాహకులు ప్లాట్లు చేసి విక్రయించేశారు. అమాకులను మోసం చేశారు. దానిపై కొంత మంది సామాజిక కార్యకర్తలు పోరాటాలు చేస్తే జిల్లా కలెక్టర్ కదిలారు. కీలక ఆదేశాలు జారీ చేశారు. 103 సర్వే నెంబర్లో ఎట్టి పరిస్దితుల్లోనూ ఇంటి నిర్మాణాలకు అవకాశంలేదని, మున్సిపల్ అధికారులు ఎలాంటి అనుమతులు జారీ చేయొద్దని ఆదేశాలు కూడా జారీ చేశారు. దాంతో బాట పోవడం తో గ్రామ ప్రజలు, ముఖ్యంగా దళితులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ భూమి అని తెలియక, వెంచర్ నిర్వాహకుల మోసానికి కొనుక్కున వారు బలయ్యారు. కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతో ప్లాటు కొనుక్కుంటే ఇల్లు కట్టుకోవడానికి వీలులేకుండాపోయిందని వారు లబోదిబోమంటున్నారు. అయితే అది ఆషామాషీ నాయకుడు వేసిన వెంచర్ కాదు. ఆయన రాజకీయాల్లో పెద్ద నేత. జిల్లా రాజకీయాల్లో కీలక నేత. అందుకే ఆయనకు దళితుల దారిని మూసేయడం పెద్ద లెక్కకాలేదు. చ{్టమంటే ఆయనకు భయం లేదు. అందుకే ఇంత దుర్మార్గానికి ఒడిగట్టారు. అసలు దారి మూసి దరిద్రపు దందా చేయాల్సిన అవసరం లేదు. కాని సొమ్మంటే ఎవరికి చేదు. అక్రమంగా లక్షలు వస్తున్నాయంటే ఎవరు ఊరుకుంటారు అన్నట్లే వుంది. ఆ నాయకుడి వ్యవహారం. వెంచర్ మధ్యలో ప్రభుత్వ భూమి వుందని, అది ప్రజలకు ఉపయోగపడే దారి అని తెలిసినా ఆక్రమించారంటే ఎంత జగజ్జంత్రీ నాయకుడో అర్ధం చేసుకోవచ్చు. నన్ను ఎదరించే ధైర్యం ఎవరికి వుందన్న అహం కూడా తోడు కావడంతో ఇదంతా జరుగుతోంది. అదికారులు , నాయకులు కలిస్తే ఎలా వుంటుందో ఈ వెంచర్‌ను చూస్తేనే అర్దమౌతోంది. అసలు ప్రభుత్వ భూమిని కబ్జా చేయడం ఒక ఎత్తైతే, దానిని ప్రైవేటు వ్యవసాయ భూమి అని వరి నాట్లు వేయడం మరీ విడ్డూరం. విచిత్రం. సామాజిక కార్యకర్తల ఒత్తిడి తట్టుకోలేక అధికారులు వచ్చినట్లు రావడం, వరి నాట్లు చూసి ఇప్పటికిప్ప్పుడు చర్యలు తీసుకోలేమని వెళ్లిపోవడం అలవాటుగా మారింది. దళిత వాడకు వెళ్లే ప్రజలకు శాపమైంది. అసలు లోకాయుక్త ఆదేశాలను కూడా అదికారులు అమలు చేసే ధైర్యం చేయలేకపోతున్నారు. అయినా పోలీసు యంత్రాంగం ఏం చేస్తోంది? రెవిన్యూ యంత్రాంగం ఏం చేస్తోంది. గత ప్రభుత్వంలో పలుకుబడితో ప్రభుత్వ భూమిని కబ్జాపెట్టిన నాయకుడికి, ప్రజా ప్రభుత్వంలో కూడా ఎలా అండదండలు కొనసాగతున్నాయనేదానికి సమాధానం చెప్పే వారు లేరు. దళితులకు న్యాయం చేయాలని అడిగే నాయకుడు లేకుండాపోయారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈ వ్యవహారాన్ని పట్టించుకోవడం లేదు. అదికారుల మీద ఒత్తిడి తేవడం లేదు. ప్రభుత్వ భూమిని ఆక్రమించిన అంజనా టౌన్ షిప్లో భాగమని చూపిస్తున్న ప్రభుత్వ భూమికి సంబంధించి రెవిన్యూ అదికారులు, పోలీసు శాఖ ఎందుకు ఇంత వరకు బోర్డు ఏర్పాటు చేయడంలేదు. అది ప్రభుత్వ భూమి, ఎవరూ కొనుగోలు చేయొద్దని అదికారులు ఎందుకు హెచ్చరికలు జారీ చేయలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన హద్దులు చెరిపేస్తే చట్ట పరమైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? ప్రభుత్వం అధికారికంగా పాతిన హద్దులను చెరిపేసేంత ధైర్యం ఆ నాయకుడు ఎలా చేస్తున్నాడు? అధికారులు చేతులు కట్టుకొని చోద్యం ఎందుకు చూస్తున్నారు? ప్రజలకు అండగా నిలవాల్సిన అధికారులు ఏం సంకేతాలిస్తున్నారు? అమాయక ప్రజలకు తోడుగా నివాల్సిన అదికారులు టౌన్ నిర్వాహకులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఈ ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారు?
