
Western Culture Influence.
భర్త ప్రేమ కాదంది.. బాల్య ప్రేమ రమ్మంది
అత్తగారు పెట్టిన బంగారం.. ప్రియుడికి దాసోహం.
పసి పాపని వదిలి.. ప్రియుడుతో మహిళ జంప్.
కానిస్టేబుల్ ను పెళ్లాడిన యువతి
బంధువులు బతిమిలాడిన.. కనికరం లేని మహిళ.
నేటిధాత్రి
నవ మాసాలు మోసిన కన్న తల్లిదండ్రులు తన కూతురు క్షేమంగా ఉండాలని మంచి సంసార జీవితం గడపాలని.. కలలు కన్నా వారికి నిరాశే మిగిలిన సంఘటన బాలానగర్ మండల కేంద్రంలో బుధవారం రాత్రి జరిగింది. ఎస్సై లెనిన్ వివరాల ప్రకారం.. మండలంలోని ఓ తండాకు చెందిన యువకుడితో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని ఓ తాండకు చెందిన యువతితో ఐదేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి మూడేళ్ల పాప ఉంది. అయితే ఆ యువతి రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో విద్య నభ్యసించింది. ఆ సమయంలోనే ఆ యువతికి ఓ స్నేహం ఏర్పడింది. స్నేహం కాస్త ప్రేమగా మారింది. అనంతరం ఆమె సొంత ఇంటికి రాగా.. బాలానగర్ మండలంలోని తండాకు చెందిన యువకుడితో పెళ్లి చేశారు. సంసారం జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో.. ఆ మహిళకు గతంలో మహేశ్వరంలో పరిచయమైన యువకుడికి ఇటీవలే పోలీస్ కానిస్టేబుల్ జాబు వచ్చింది. పాత పరిచయం విరబూసిన మల్లె పువ్వుల మళ్లీ చిగురించింది. వారి ప్రేమ కొనసాగుతూ.. వచ్చింది. ఇటీవలే ఆ కానిస్టేబుల్ బెట్టింగ్ గ్యాప్ లో డబ్బులు పోగొట్టుకోగా.. ఈ మహిళను సంప్రదించాడు. ఆమె మెడపై ఉన్న బంగారు నగలను ప్రియుడికి ఇచ్చింది. కుటుంబ సభ్యులు నిలదీయగా అసలు బండారం బయటపడింది. భయంతో కానిస్టేబుల్ తో ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్ళిపోయింది. ఇద్దరు శ్రీశైలంలో ఐదు రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు. భార్య కనిపించకపోవడంతో భర్త పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

బుధవారం మహిళను భర్తను పోలీస్ స్టేషన్లో విచారించగా.. తను భర్త దగ్గరకు వెళ్ళనని చెప్పింది. బంధువులు ఆ యువతికి మూడేళ్ల పాప ఉంది. జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చేతులు జోడించి వేడుకున్న మహిళా కనుకరించలేదు. చివరకు కానిస్టేబుల్ వద్దకే వెళ్తానని చెప్పింది. ఎస్ఐ లెనిన్ మహిళకు నచ్చజెప్పిన.. వినకపోవడంతో చేతులెత్తేశారు. పసి బాలిక తల్లి వద్ద ఉండలేక.. తండ్రిని చూస్తూ.. డాడీ.. డాడీ అని ఏడుస్తుంటే.. చూసి బంధువులు పోలీస్ స్టేషన్లో ఉన్న సాధారణ వ్యక్తులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు. చిన్న వయస్సులో భవబంధాలకు దూరమై అమాయక చూపులు చూస్తున్న బాలిక ఏమీ తెలియక ఆ పసి గుడ్డు నిచ్చేష్టురాలై ఉండిపోయింది. చివరకు ఆ మహిళ.. బాబాయ్ ఇంటికి వెళ్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ మహిళ చేసిన పని పట్ల తల్లి తీవ్ర మనోవేదనకు గురైంది. తమ ఇంటి పరువు తీస్తుందని తల్లి రోధించింది. నేటి మహిళలు పాచ్యత్య సంస్కృతిని అవలంబిస్తున్నారని కొందరు మహిళలు వికృత చేష్టలతో.. మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయని, మహిళలు గౌరవాన్ని కోల్పోతున్నారని స్థానికులు అన్నారు.