*గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో వసతి గృహంలో మెనూ పాటించంచని వార్డెన్లు పై ఐటీడీఏ పీవో ప్రత్యేక

 

భద్రాచలం డివిజన్ నేటి ధాత్రి

దృష్టి సారించాలి* భద్రాచలం ఐటీడీఏ పరిధిలో జిల్లా
మానవహక్కుల అధ్యక్షులు ముత్తవరపు జానకిరామ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర గోండ్వాన సంక్షేమ పరిషత్ అధ్యక్షులు పాయం సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో బోధించే హెడ్ మాస్టర్, వార్డెన్ లు, ఉపాధ్యాయులు స్థానికంగా కల్పించిన ఇండ్లు కోటర్స్ భవనాలను ఉపయోగించు కోకుండా సమయానికి పాఠశాలకు చేరుకోకుండా దూర ప్రాంతాల నుండి ప్రయాణాలు చేస్తూ ఏజెన్సీ ఎలావెన్స్ లను పొందుతున్న ఉపాధ్యాయులు పై దృష్టి సారించని అధికారులు తక్షణమే అలాంటి ఉపాధ్యాయులు ఏజెన్సీ ఎలావెన్స్ రద్దు చేసి సమయ పాలనలో విద్యార్థులకు విద్యని సమయానికి అందించే విదంగా ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని ఇలాంటి విషయాల్లో ఉన్నత అధికారులకు తప్పుడు రిపోర్టులు అందిస్తూన్నా, ఏ టి డబ్ల్యు ల పై ప్రత్యేక నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలని
అలాగే పిల్లలకు పంచవాల్సిన బుక్స్ యూనిఫామ్ షూ లు పంచకుండా పక్కదారి పడుతున్నాయి అని ఆరోపించారు. దసరా సెలవుల్లో వచ్చిన విద్యార్థుల తెలిపారు మా దృష్టికి వచ్చింది అని అలాగే పిల్లల తల్లిదండ్రులు మంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి సదుపాయాల తో పాటు మంచి విద్యని అందిస్తుంది అని బావిస్తున్నారు కానీ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో అనేక సమస్యలను వివరిస్తూ వసతి గృహంలో అందించే మెనూ పేరుకే అని విద్యార్థుల తల్లిదండ్రులుతో తెలపడం విశేషం.హాస్టల్ గేటు బయట ప్రేవేసానికి అనుమతులు లేవని తప్పని సరి అని బోర్డు లు పెట్టి ,సమస్యలను ప్రశ్నించే సంఘాలను అనుమతించక ప్రజలకు విజిటింగ్ అవకాశం లేక పోవడంపై, హాస్టల్ హెడ్ మాస్టర్లకు, వార్డెన్ లకు, మరో చక్కటి అవకాశం, వాళ్ళు ఆడిందే ఆట గా పాడిందే పాటగా సాగుతున్న, వైనాలు చోటు చేసుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి ఈ రోజున
ఇంటికి వచ్చిన పిల్లలు తెలుపుతున్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రమ పాఠశాలకు నూతన కొత్త మెనూ ప్రకటించిన మెనుపై విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ
తెలంగాణ రాష్ట్ర గోండ్వాన సంక్షేమ పరిషత్ అధ్యక్షులు పాయం సత్యనారాయణ అఖిల భారత మానవహక్కుల సంఘము జిల్లా అధ్యక్షులు ముత్తవరపు జానకిరామ్ ఈ సందర్భంగా తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!