హోలీ పండుగ శుభాకాంక్షలు
తెలియజేసిన
ఐటీడీఏ పీవో
బి రాహుల్ ఐఏఎస్
భద్రాచలం నేటి దాత్రి,:
ఏజెన్సీ ఏరియా పరిధిలో వివిధ కార్యాలయాలలో పనిచేయుచున్న ఉద్యోగులు, ఆశ్రమ, గురుకుల పాఠశాల, కళాశాలలో పనిచేస్తున్న ప్రిన్సిపాల్, అధ్యాపకులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు గిరిజన విద్యార్థిని, విద్యార్థులకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ గురువారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రతి సంవత్సరం చతుర్దశి నాడు కాముని దహనం జరిపి, మరుసటి రోజు పాల్గున పౌర్ణమి రోజు హోలీ పండుగను జరుపుకుంటారని, వసంత కాలంలో వాతావరణం చలి నుండి వేడికి మారటం వలన వైరల్ జ్వరం, జలుబు, లాంటి వ్యాధులు ప్రభలుతాయి కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారుచేసిన సహజమైన రంగులు కలిపిన నీటిని చల్లుకోవడం వలన ఈ వ్యాధుల వ్యాప్తి నుండి బయట పడవచ్చనే నమ్మకముతో ఈ పండగ జరుపుకుంటారని, ఈ పండుగ అంటే అందరికీ ఆనందమే కానీ స్వయంకృత అపరాధం వలన
ఇబ్బందులు కొని తెచ్చుకోకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని, హోలీ ఆడిన తర్వాత కాలువలను, చెరువులను, నదులు, వాగులు, వంకలకు ఎవరు వెళ్ళవద్దని, సరదా మాటు న ప్రమాదం పొంచి ఉందని, తల్లిదండ్రులు పిల్లలను ఈతకు
వెళ్ళకుండా నియంత్రణ చేయాలని తెలుపుతూ అలాగే ఆశ్రమ మరియు గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు సరదాగా ఓడి ఆడుకున్న తర్వాత ఎవరిని బయటికి పంపకుండా చూడవలసిన బాధ్యత సంబంధిత హెచ్ఎం వార్డెన్ చూసుకోవాలని తెలుపుతూ, అందరూ సంతోషంగా హోలీ పండుగ జరుపుకోవాలని కోరుతూ మరి ఒకసారి అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఆయన అన్నారు.