పోలీస్‌ ప్రతిష్టను దిగజారిస్తే సహించేది లేదు

# వరంగల్ పోలీస్ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా.
వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి :

పోలీస్‌ విభాగం కీర్తి ప్రతిష్టలను దిగజాచ్చే విధంగా వ్యవహరిస్తే సహించేది లేదని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అధికారులకు సూచించారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు చెందిన పోలీస్‌ పోలీస్‌ అధికారులతో పోలీస్‌ కమిషనర్‌ అధ్వర్యంలో పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో బుధవారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసారు. డిసిపిలు, అదనపు డిసిపిలు, ఏసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు, ఆర్‌.ఐలు, ఎస్‌.ఐలు పాల్గోన్న ఈ సమావేశంలో పోలీస్‌ కమిషనర్‌ ముందుగా శాంతి భద్రతలకు సంబంధించి పలుఅంశాలపై అధికారులతో చర్చించడంతో పాటు, వచ్చే నెల 4వ తారీఖున ఏనమాముల మార్కేట్‌లో నిర్వహబడే పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు సజావు నిర్వహించేందుకుగా తీసుకోవాల్సిన పోలీస్‌ బందోబస్తుతో పాటు ఎన్నికల కోడ్‌ ఉల్లంఘలకు పాల్పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్‌ కమిషనర్‌ పోలీస్‌ అధికారులతో ముచ్చటించడంతో పాటు, చేపట్టాల్సి ముందస్తూ చర్యలపై పోలీస్‌ కమిషనర్‌ అధికారులకు పలుసూచనలు చేశారు. అధే విధంగా జూన్‌ 9 న నిర్వహించబడే గ్రూప్‌ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకుగాను పోలీస్‌పరంగా తీసుకుంటున్న చర్యలపై పోలీస్‌ కమిషనర్‌ సంబంధిత పోలీస్‌ అధికారులను అడిగితెలుకున్నారు. వర్షకాలం సమీపిస్తున్న వేళ రైతులు నకీలీ విత్తనాల బారీన పడకుండా స్థానిక పోలీసులు తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్‌ కమిషనర్‌ ప్రత్యేక దృష్టిసారించారు. ఇందులో భాగంగా నకీలీ విత్తనాల విక్రయాలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరించాల్సిందిగా పోలీస్‌ కమిషనర్‌ అధికారులకు ఈ సమావేశంలో సూచించారు.


అనంతరం పోలీస్‌ కమిషనర్‌ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ పోలీస్‌ స్టేషన్లలో విధులు నిర్వహించే ప్రతి పోలీస్‌ అధికారి నీతినీజాయితీతో విధులు నిర్వహించాల్సి వుంటుందని. ప్రతి ఒక్కరు సమయపాలన పాటిస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో వుంటూ వారి ఫిర్యాదులను పరిష్కరించే దిశగా అధికారులు విధులు నిర్వహించాలని అన్నారు. ప్రజలు పోలీసులపై ఉన్న నమ్మకానికి తగ్గట్లుగానే సాధరణ ప్రజలకు సరైన న్యాయం అందించడం ద్వారా పోలీసు వ్యవస్థకు సమాజంలో పేరు ప్రతిష్టలు, గౌరవం పెరుగుతాయని,అలాగే నకిలీ విత్తనాల నియంత్రణకై పోలీసులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, రైతులకు నష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత మనపై వుందని చెప్పారు. రైతుల ముఖాల్లో సంతోషాన్ని చూసేందుకైనా నకిలీ విత్తనాలను అరికట్టడం పోలీస్‌ అధికారులు మరింత శ్రమించాల్సిన అవసరం వుందని అన్నారు. శాంతి భద్రతలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు వున్న ప్రజలు ముందుగా సంబంధిత పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, మీ ఫిర్యాదుపై సరైన న్యాయం జరగని పక్షంలో మాత్రమే ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయాలని, ముఖ్యంగా పోలీస్‌ కమిషనర్‌ ఎదైనా ఫిర్యాదు చేయాలనుకునేవారు ఫిర్యాదుదారులు 8712685070 వాట్సప్‌ నంబర్‌కు మీ ఫిర్యాదులను పోస్ట్‌ చేయడం ద్వారా ఫిర్యాదులపై తగుచర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీస్‌ కమిషనర్‌ తెలియజేశారు. అనంతరం పార్లమెంట్‌, ఉప ఎమ్మెల్సీ ఎన్నికలను సజావు నిర్వహించడంలో కృషి చేసిన పోలీస్‌ అధికారులకు పోలీస్‌ కమిషనర్‌ చేతుల మీదుగా ప్రశంస పత్రాలను అందజేసారు. ఈ సమావేశంలో డిసిపిలు అబ్దుల్‌బారీ, రవీందర్‌, ఏఎస్పీ అంకిత్‌, అదనపు డిసిపిలు రవి, సంజీవ్‌,సురేష్‌కుమార్‌తో పాటు ఎసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, ఎస్‌.ఐలు పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!