దళితుల అభ్యున్నతికై పాటుపడుతా

*దేశంలోనే ఎక్కుడ లేని విధంగా దళితులకు అన్ని రంగాల్లో ప్రాధాన్యతను ఇస్తున్నా ఏకైక రాష్ట్రం తెలంగాణ

*సీఎం కేసీఆర్ నాయకత్వంతోనే దళితుల అభివృద్ధి సాధ్యమవుతుంది

చందుర్తి, నీటిదాత్రి:


రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో సమాజంలో అట్టడుగు వర్గాలుగా ముద్రపడిన దళితుల అభ్యున్నతి కొరకు తన వంతు కృషి చేస్తానని బి.ఆర్.ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహ రావు అన్నారు. గురువారం చందుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి దళితుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చల్మెడ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఏ ఇతర రాష్ర్టాల్లో లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో దళితులకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు, రాజకీయాల్లో సముచిత స్థానం కల్పిస్తున్న పార్టీ బి.ఆర్.ఎస్ పార్టీ అని అన్నారు. దళితులు ఆత్మగౌరవంతో బ్రతకాలనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ నాయకత్వంలో సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడంతో పాటు దాని ఆవరణలో 125అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, దళిత సమాజం అభ్యున్నతి కొరకు దళిత బంధు, దళిత విద్యార్థుల విదేశీ విద్య కొరకు రూ.25లక్షల సాయం అందిస్తున్నట్లు తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థిని విద్యార్థుల నాణ్యమైన చదువుల కొరకు రాష్ట్రంలో 1000 గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి, సకల సౌకర్యాలతో కూడిన విద్యా బోధన అందిస్తున్నామని అన్నారు. స్థానిక దళిత సోదరులు కోరిన మేరకు మండల కేంద్రంలో దళిత భవన్ ఏర్పాటుతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న సంఘం భవన నిర్మాణాలు పూర్తి చేయుటకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మిగిలి ఉన్న జీవితం మొత్తం ప్రజా సేవ చేయాలనే ఆలోచనతో ముందుకు వస్తున్నానని, ఒక్కసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే దళితుల అభ్యున్నతికి పాటుపడుతానని హామీ ఇచ్చారు. అనంతరం నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ సంపూర్ణ మద్దతు చల్మెడకే ఉంటుందంటూ సుమారు 500మంది దళిత సంఘం సభ్యులు చల్మెడ సమక్షంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం డివిజన్ అధ్యక్షుడు దమ్మ ఆనంద్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దప్పుల అశోక్, కో-అప్షన్ సభ్యుడు కమలాకర్, పార్టీ మండల అధ్యక్షుడు మ్యాకల ఎల్లయ్య, మాజీ సర్పంచ్ సంటి బాబురావు, ఎ.ఎం.సి డైరెక్టర్ కొమ్ము రమేష్, మదాస్ ప్రసాద్, ప్యాక్స్ డైరెక్టర్లు గుడిసె రమేష్, నగరం శంకర్, బేడబుడగ జంగాల మండల అధ్యక్షుడు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!