కేసీఆర్ వల్లే తెలంగాణకు స్వేచ్ఛ, స్వపరిపాలన సిద్ధించింది.
-ప్రజా సంక్షేమమే పరమావధిగా కేసీఆర్ పాలన సాగింది
-విలేకరుల సమావేశంలో చదువు అన్నారెడ్డి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
తెలంగాణ ఆస్తి కేసీఆర్ అని 14ఏండ్ల ఉద్యమ చరిత్ర, 10ఏండ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ నాయకత్వములో తెలంగాణ సుభిక్షంగా ఉందని, కొంతమది చేసిన కుట్రలు, కుతంత్రాల వల్ల అధికారం కోల్పోయిన ప్రజలలో కేసీఆర్ కు అభిమానం తగ్గలేదని సర్పంచుల ఫోరం మొగుళ్లపల్లి మండల మాజీ అధ్యక్షులు చదువు అన్నారెడ్డి అన్నారు. సోమవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ముల్కలపల్లి గ్రామంలో గల తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికార కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని, కేసీఆర్ విలువ బీఆర్ఎస్ పార్టీ అవసరం ప్రజలకు తెలిసివచ్చిందన్నారు. నాయకులు ఎల్లపుడు ప్రజల మధ్యన ఉండి వారి సమస్యలలో పాలుపంచుకోవాలని అటువంటి నాయకులకే పార్టీ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు రైతుబంధు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు రూ.2500, తులం బంగారం, నిరుద్యోగ భృతి వంటి అంశాలు ప్రజలకు వివరించాలన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయని సకల జనులు బీఆర్ఎస్ వైపు చూస్తారని అన్నారెడ్డి అన్నారు.