మందమర్రి, నేటిధాత్రి:-
డీజే, వాటి శబ్దాలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని మందమర్రి సిఐ కే శశిధర్ రెడ్డి, పట్టణ ఎస్ఐ ఎస్ రాజశేఖర్ లు డిజే నిర్వహకులకు సూచించారు. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్లో డీజే నిర్వహకులు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, హృద్రోగులకు, చిన్న పిల్లలకు డిజే శబ్దాలతో ఇబ్బందులు కలుగుతాయని రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో డీజే లపై నిషేధాజ్ఞాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో సైతం డీజే శబ్దాలతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, పెళ్లిలో సైతం రాత్రి 10 గంటల తర్వాత డిజెలకు అనుమతులు లేవన్నారు. ఈ కార్యక్రమంలో డిజే నిర్వహకులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.