
DSR Group companies..
మరోసారి ఐటీ దూకుడు
మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు.. డీఎస్ఆర్ గ్రూప్ సంస్థల్లో కూడా..సోదాలు
హైదరాబాద్ ,నేటిధాత్రి:
చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన నివాసంతోపాటు కార్యాలయాల్లో కూడా గాలిస్తున్నారు. మరోవైపు డీఎస్ఆర్ గ్రూప్ కన్స్ట్రక్షన్స్ కంపెనీలో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. కంపెనీ టాక్స్ చెల్లింపులలో భారీగా అవకతవకలు జరిగినట్లు సమాచారం రావడంతో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారలు తెలిపారు.
డీఎస్ఆర్ గ్రూప్ కన్‌స్ట్రక్షన్స్‌తోపాటు డీఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, డీఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల్లో మంగళవారం ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కంపెనీ ఎంపీ సుధాకర్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్ ఇండ్లలో తనిఖీలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్, సురారంతోపాటు ఏకకాలంలో 10 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గడిచిన ఐదేండ్ల పన్నుల చెల్లింపులపై కంపెనీ యాజమాన్యాన్ని అధికారులు ఆరా తీస్తున్నారు. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి డీఎస్ఆర్ గ్రూప్‌లో భాగస్వామిగా ఉన్నారు.