నేటిధాత్రి: హైదరాబాద్
(Hyderabad)లో ఐటీ దాడులు (IT Raids) కలకలం సృష్టిస్తున్నాయి. నగర వ్యాప్తంగా మొత్తం 8 చోట్ల ఏక కాలంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు (Income Tax Officers) సోదాలు చేడుతున్నారు. ఏకంగా 55 బృందాలు రంగంలోకి దిగి ప్రముఖ నిర్మాత “దిల్ రాజు” (Producer Dil Raju) నివాసంతో పాటు ఆఫీసులో మంగళవారం తెల్లవారుజాము నుంచి సోదాలు చేపడుతున్నారు. బంజారాహిల్స్ (Banjara Hills), జూబ్లీహిల్స్ (Jubilee Hills), కొండాపూర్ (Kondapur), గచ్చిబౌలి (Gachibowli)తో సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా దిల్ రాజు సోదరుడు, కుమార్తె, బంధువుల ఇళ్లలో కూడా అధికారులు జల్లెడ పడుతున్నారు. ఈ ఐటీ రెయిడ్స్‌పై మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
కాగా, ఇటీవలే నిర్మాత “దిల్ రాజు” (Dil Raju) భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer), ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankrantiki Vasthunnam) మూవీలను నిర్మించారు. ఆ రెండు మూవీలు కూడా ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలై సూపర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఐటీ అధికారులు ఆయన నివాసం, ఆఫీసు, బంధువుల ఇళ్లపై దాడులు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.