Farmers Demand Loan Reschedule After Cyclone Damage
రుణాలు చెల్లించాలని రైతులకు నోటీసులు ఇవ్వడం అన్యాయం
రైతుల పంట రుణాలను రీ షెడ్యూల్ చేయాలి
మోంథా తుఫాన్ తో తీవ్రతతో జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు కృషి చేయాలి
ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్
నర్సంపేట,నేటిధాత్రి:
అధిక వర్షాలు, మోంథా తుఫాన్, యూరియా కొరతలతో పంటలు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న రైతులకు పంట రుణాలు చెల్లించాలని సొసైటీలు, బ్యాంకులు నోటీసులు ఇవ్వడం దారుణమని తక్షణమే అట్టి నోటీసులను ఉపసంహరించుకొని పంట రుణాలను రీ షెడ్యూల్ చేయాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు.నర్సంపేట పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతుల వ్యవసాయం అధిక వర్షాలు యూరియా కొరతతో అస్తవ్యస్తంగా మారిందని, పంటల దిగుబడి తగ్గిందని ఈ క్రమంలో అరాకోరా పంటలు చేతికచ్చే దశలో మోంథా తుఫాన్ తో ములిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారిందని అవేదన వ్యక్తం చేశారు.జిల్లాలో సుమారు లక్షా 50 వేల ఎకరాలలో పత్తి మొక్కజొన్న వరి తదితర పంటలు కోల్పోయారని దాంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలిపారు.తుఫాన్ తో తీవ్రంగా నష్టపోయిన వరంగల్ జిల్లా ప్రజలను ఆదుకునేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని జిల్లా మంత్రి సురేఖ,నర్సంపేట వర్ధన్నపేట పరకాల ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి
అదుపోవాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు కన్నం వెంకన్న, డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి, డివిజన్ నాయకులు జన్ను రమేష్ ముర్రి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
