నాణ్యమైన వస్తువులు పొందడం వినియోగదారుని హక్కు

విఎసిసి చైర్మన్ డాక్టర్ రాజలింగు మోతె

రామకృష్ణాపూర్, ఫిబ్రవరి 28, నేటిధాత్రి:

నాణ్యమైన వస్తువులు పొందడం వినియోగదారుని హక్కని విఎసిసి చైర్మన్ డాక్టర్ రాజలింగు మోతె అన్నారు.రామకృష్ణాపూర్ సూపర్ బజార్ లోని విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ కౌన్సిల్ కార్యాలయంలో బుధవారం రోజు నిర్వహించిన సమావేశంలో విఎసిసి కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్,సోషల్ డిటెక్టివ్ సెల్ నూతన కమిటీని కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ రాజలింగు మోతె, వైస్ చైర్మన్ దుర్గం వెంకటస్వామి ప్రకటించారు.కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మాదాసు శ్రీకాంత్ యాదవ్, కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ సెల్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కెలోత్ బాలు, జనరల్ సెక్రటరీ వుల్లంగుల సదానందం, సోషల్ డిటెక్టివ్ సెల్ జిల్లా అధ్యక్షులు దుస్స ఆదిత్య కుమార్ నీ ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా కౌన్సిల్ చైర్మన్ మాట్లాడుతూ అవినీతిని నిర్మూలించడానికి,అవగాహన కల్పించడానికి పోలీసు,మీడియా,ప్రజలకు ఉమ్మడి వేదికగా కౌన్సిల్ పనిచేస్తుందన్నారు.నాణ్యమైన వస్తువులు పొందడం వినియోగదారుని ప్రాథమిక హక్కని,వినియోగదారుల హక్కుల కోసం కౌన్సిల్ సభ్యులు పనిచేయాలని ఆయన సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *