జిల్లాలో జరిగిన అవకతవకాలు,అక్రమాలు,అవినీతి మొత్తం బయటపెడుతాం
– కేటీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయి.
– నేతన్నల పై మొసలి కన్నీరు కరుస్తున్నాడు
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..
సిరిసిల్ల(నేటి ధాత్రి):
రాజన్న సిరిసిల్ల
జిల్లాలో జరిగిన అవకతవకాలు,అక్రమాలు,అవినీతి మొత్తం బయటపెడుతాం అని ప్రభుత్వ విప్,వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు..గురువారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు..
వారు మాట్లాడుతూ సిరిసిల్ల నేతన్నల మీద అవినీతి అక్రమాలకు పాల్పడిన కేటీఆర్ ముందుగా సిరిసిల్ల ప్రజలకు క్షమాపణ చెప్పాలని, అహంకారపూరిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హెచ్చరించారు.
అధికారం కోల్పోయిన ఇంకా అహంకారపూరిత మాటలు కేటీఆర్ మానుకోవడం లేదని ఇప్పటికే ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. ముందుగా కేటీఆర్ సిరిసిల్ల నేత కార్మికులకు క్షమాపణ చెప్పాలని.. బతుకమ్మ చీరల బకాయిలు పెండింగ్లో పెట్టినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేత కార్మికులకు అనేక ఆర్డర్లు ఇప్పటికే ఇచ్చామని రానున్న రోజుల్లో ప్రతి మహిళకు నాణ్యమైన రెండు చీరలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆది శ్రీనివాస్ గుర్తు చేశారు…
ఇప్పటికే నేత కార్మికులకు సంబంధించిన అనేక పథకాన్ని అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో సిరిసిల్లలో జిల్లాలో మీరు చేసిన అవినీతి అక్రమాలను వెలికి తీస్తామని హెచ్చరించారు.
బిఆర్ఎస్ పార్టీ లో రానున్న రోజుల్లో మిగిలేది మీ నలుగురు మాత్రమే అన్నారు..
బతుకమ్మ చీరాల ను సూరత్ నుండి తెప్పించి కోట్లు సంపాదించినడి ఎవరని ప్రశ్నించారు.. ఇకనైనా నేతన్న లపై ఇంకా రాజకీయం మానుకోవాలని అన్నారు..
మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొగోడు కాబట్టే రాష్ట్రంలో పాదయాత్ర చేసి ప్రజా సమస్యలపై పోరాటం చేసి మిమ్మల్ని గద్దె దించాడని పేర్కొన్నారు…
ముఖ్యమంత్రి 9 నెలల్లో ఒక్క రోజు కూడా సెలవు పెట్టలేదన్నారు..
అధికారులు, మేధావుల సూచనలు తీసుకుంటూ నిర్ణయాలు తీసుకుంటుంన్నారు.బతుకమ్మ చీరల బకాయిలు చెల్లించామని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
కేటీఆర్ కు అధికారం పోయిన దురహరం, పొగరు మాటలు బంద్ చేయడం లేదని,బతుకమ్మ చీరల పై ఇంకా రాజకీయం చేస్తూ కలయాపన చేస్తున్నారన్నారు…
గత ఎన్నికల్లో గెలవడానికి నేతన్నాలకు బకాయిలు పెట్టి వారి జుట్టు చేతుల్లో పెట్టుకోవాలి చూసావు..బతుకమ్మ చీరలకు 197 కోట్లు బకాయిలు పెట్టింది నీవు కదా అని ప్రశ్నించారు..
ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ హన్హూమ్స్
టెక్నాలజీ నందు 60 సీట్లకు గాను 12 మంది విద్యార్థులు రాజన్న సిరిసిల్ల నుండి అడ్మిషన్ తీసుకోవడం జరిగినది..
రాష్ట్రంలోని చేనేత కార్మికులకు నేతన్నకు చేయూత (త్రిప్ట్ ఫండ్) రూ. 90.00 కోట్లు విడుదల చేయడం
జరిగినది…ఇప్పటికే స్కూల్ యూనిఫామ్, పోలీసు యూనిఫామ్ సంబంధించిన బట్ట ఆడర్లు ఇస్తున్నామని పేర్కొన్నారు..
సిరిసిల్ల లో కాటన్, పాలిస్టర్ ఉత్పత్తులు ఏమయ్యాయి..
సిరిసిల్ల కి మార్కెట్ ని దూరం చేసింది నీవు కదా రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లు అప్పులు చేసిన మేము ప్రజా పాలన చేస్తున్నాం..
కేటీఆర్ ఇకనైనా నీ బుద్ధి మార్చుకో మీ ప్రభుత్వం ను ప్రజలే పక్కన బెట్టారు…లోక సభ ఎన్నికల్లో ఏమైంది..ఒక్క సీటు గెలువలేదు..
మళ్ళీ ఉపఎన్నికలు అంటున్నావ్, వస్తె మీ బిఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని మొన్నటి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది అని తెలిపారు..
సిఎం రేవంత్ రెడ్డి మహిళల సంఘాలకు 1 కోటి 30 లక్షలు చీరాల అర్దర్డ్స్ ఇస్తామని సిఎం చెప్పారు..మహిళలను ఆర్టీసి లోని ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే, వారిని రికార్డు డ్యాన్సులు అన్నవ్…
నీకు ఈర్ష్య, ద్వేషం, ఉన్నాయి…అసెంబ్లీ కి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మీ తండ్రి కేసీఆర్, ఎందుకు రావడం లేదన్నారు..
బిఆర్ఎస్ పార్టీ స్కీమ్ లు అన్నీ స్కాం లే అని,
హైడ్రా తో ప్రజల సంపాదన కాపాడే ప్రయత్నం చేస్తున్నాం..కబ్జా లకు గురి ఆయిన నాళాలు, చెరువులు కాపాడుతున్నం…
సిరిసిల్ల జిల్లాల్లో జరిగిన అవకతవకల పై, అన్ని త్వరలోనే బయటకు తీస్తాం..నీవు వాటికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది..
మేము కక్ష్య సాధింపు అనుకుంటే మీ హాయంలో అన్న అధికారులే ఇంకా పనిచేస్తున్నారని కేటీఆర్ ఇప్పటికైనా అహంకారం తగ్గించుకోవాలని పేర్కొన్నారు..