జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
భూపాలపల్లి నేటిధాత్రి
ఆజాదిక అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా
జియో లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రేగొండ, మండలం పండవులగుట్ట వద్ద నిర్వహించిన జియో హెరిటేజ్ అవగాహన సదస్సులో పాల్గొని, హెరిటేజ్ వాక్ ను జండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ
ప్రాచీన వారసత్వ సంపదను కాపాడుకోవడం అందరి బాధ్యత అని
మన వారసత్వ సంపదను, ఇతర వనరులను కాపాడడానికి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పనిచేస్తుందని చెప్పారు.
స్వాతంత్య్రానికి ముందుగానే
174 సంవత్సరాల క్రితం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ ఏర్పడిందన్నారు.
పురాతన వారసత్వ ప్రదేశాలు గుర్తిస్తున్న క్రమంలో దేశంలో 90 ప్రాంతాలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించిందని అందులో మన జిల్లాలోని పాండవుల గుట్టను గుర్తించడం సంతోషకరమని అన్నారు.
హిమాలయాల కంటే ముందుగానే మన పాండవుల గుట్ట
ఏర్పడినట్లు చరిత్ర ఆధారాలు ఉన్నాయని తెలిపారు. చారిత్రక వారసత్వ సంపదను కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని
ప్రాచీన పాండవుల గుట్టను చూడడానికి చాలామంది ఇతర ప్రాంతాల నుండి వస్తారని దాని ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు.
పాండవుల గుట్ట లాంటి ప్రాంతాలలో జియో హెరిటేజ్ లాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఈ ప్రాంతానికి గుర్తింపు లభించి, కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తాయని తెలిపారు.
విద్యార్థులు ప్రాచీన వారసత్వ సంపద గురించి అవగాహన పెంపొందించుకుని,
వాటిని కాపాడుకోవడం కోసం పాటుపడాలని జిల్లా కలెక్టర్ కోరారు.
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ
జాతీయ భూ విజ్ఞాన వారసత్వ సంపదను సంరక్షించడానికి అనేక చట్టాలను రూపొందించు కుంటున్నామని
కేంద్ర ప్రభుత్వం అధ్వర్యంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా భావితరాలకు మన ప్రాచీన వారసత్వ సంపద గూర్చి తెలిపేందుకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది అన్నారు.
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా 90 అతి ప్రాచీన ప్రాంతాలను ప్రాంతాలను గుర్తించిందని అందులో తెలంగాణ రాష్ట్రంలోని పాండవుల గుట్ట ఒకటని అన్నారు. విద్యార్థులు పాండవుల గుట్ట గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, రాబోవు రోజుల్లో సైంటిస్టులుగా ఎదిగి మన జిల్లాకు, రాష్ట్రానికి, తద్వారా దేశానికి సేవలు అందించాలని ఆయన సూచించారు.
ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే పాండవుల గుట్ట గొప్ప ప్రాముఖ్యత కలిగిన ప్రాంతమని 168.5 కోట్ల సంవత్సరాల క్రితం ఇసుక రేణువుల ద్వారా గుట్ట ఏర్పడిందని తెలిపారు.
పాండవుల గుట్ట దేశంలోనే ఏకైక అధ్బుతమైన ప్రాంతం అని 150 మీటర్ల ఎత్తుతో 3 నుండి 7 కిలోమీటర్ల పొడవు ఉత్తర, దక్షణ దృవాల వైపు ఏర్పడిందన్నారు.
చరిత్ర ఆధారాల ప్రకారం పాండవుల గుట్టలో రాష్ట్రకూటులు, పాండవులు వచ్చి నివాసం ఉన్నట్లు చరిత్ర చెబుతుందని అన్నారు. ఇక్కడ ఉన్న రాక్ పెయింటింగ్ అద్భుతంగా అందరినీ ఆకట్టుకుంటుందన్నారు.
క్రీస్తు పూర్వం 10వేల సంవత్సరాల నుండి 5 వేల సంవత్సరాల వరకు ఉన్న ఆదిమానవుల కాలం నాటి ప్రాచీన చిత్రాలు రేపటి భావి తరాలకు చూపెట్టడం కోసం
జియో హెరిటేజ్ అవగాహన సదస్సు కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. ఇసుక రేణువుల ద్వారా ఏర్పడిన ప్రాంతం ఇది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి ఈ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ది చేయడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో
జిల్లా అటవీ శాఖ అధికారి వసంత, ఎంపీపీ పున్నం లక్ష్మీ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రతినిధులు,
ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.