
Tribal Farmer Donates Battery to Help Students
గిరిజన విద్యార్దుల ఉన్నతిలో బాగస్వాములవడం అభినందనీయం
సేవాగుణం చాటుకున్న ఇర్ప వసంత్
వనవాసీ గౌరవ సలహాదారులు బివిఎస్ఎల్ఎన్
నేటిదాత్రి చర్ల
జాతీయ గిరిజన సేవా సంస్దకు తనవంతు సహకారమందించి విద్యార్దుల ఉన్నతిలో బాగస్వాములయిన జిపి పల్లి గ్రామానికి చెందిన గిరిజన రైతు ఇర్ప వసంత్ తనలోని సేవాభావం చాటుకున్నారని వనవాసీ కళ్యాణ పరిషత్ కొమరం భీం విద్యార్ది నిలయం గౌరవ సలహాదారులు బివిఎస్ఎల్ నర్సింహారావు అన్నారు చర్లలోని వనవాసీ వసతి గృహంలోని ఇన్వర్టర్ బ్యాటరీ మరమ్మత్తుకు గురికావడంతో ఇర్ప వసంత్ 13వేలతో నూతన ఎమరాన్ ఇన్వర్టర్ బ్యాటరీను వితరణగా అందచేసారు ఈ సందర్భంగా శుక్రవారం విద్యార్ది నిలయంలో జరిగిన కార్యక్రమంలో బివిఎస్ఎల్ఎన్ మాట్లాడారు ఆదివాసీ రైతు తమ తోటి ఆదివాసీ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని వితరణ అందచేయడం సంతోషకరమని పేర్కొన్నారు ఇటువంటి ప్రోత్సాహకాలను మరిన్ని అందించి విద్యార్దుల జీవితంలో వెలుగులు నింపాల్సిన అవసరం ఉందన్నారు ఇటువంటి సేవాభావం కలిగి ఉన్న వారని స్పూర్తిగా తీసుకుని పేద విద్యార్దుల చదువులకు వెన్నుదన్నుగా నిలవాలని పిలుపునిచ్చారు విద్యార్ది నిలయ కమిటీ అద్యక్షుడు తాటి పాపారావు మాట్లాడుతూ వసంత్ అందించిన సహకారానికి తోటి ఆదివాసీగా గర్విస్తున్నానని పేర్కొన్నారు విద్య ఉంటే భవిష్యత్ ఉంటుందని తాము కష్టపడి చదవడం వలనే నేడు ఉన్నత స్దితికి చేరుకున్నామని వెల్లడించారు తమ లాంటి వారిని ఆదర్శంగా తీసుకొని క్రమ శిక్షణతో చదివి ఉన్నత స్దితికి చేరుకోవాలని విజ్ఞప్తి చేసారు ప్రతి విద్యార్ది భవిష్యత్ కొరకు తల్లిదండ్రులు తమ రక్తాన్ని దారపోసి సంపాదించి చదివిస్తున్న విషయం గమనించాలని వారి శ్రమను వృదా చేయకుండా ఇష్టపడి చదివి ఉన్నత స్దితికి చేరుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కొమరం భీం విద్యార్ది నిలయ కమిటీ కార్యదర్శి జవ్వాది మురళీకృష్ణ ఉపాద్యక్షులు గోగికార్ రాంలక్ష్మణ్ కోశాదికారి వేములపల్లి ప్రవీణ్ బాబు కమిటి సభ్యులు శివరాజు కిషోర్ లవన్ కుమార్ రెడ్డి బుర్రా సత్యనారాయణ మూర్తి యాదాల సందీప్ నిలయ ప్రముఖ్ గొంది ప్రసన్నకుమారి పాల్గొన్నారు