అద్దంకి దయాకర్ సేవలు గుర్తించడం గర్వకారణం.
తొర్రూరు( డివిజన్) నేటి ధాత్రి
అద్దంకి దయాకర్ సేవలు గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం గర్వకారణం అని మాల మహానాడు జిల్లా అధ్యక్షులు చిట్టి మల్ల మహేష్ పేర్కొన్నారు.
మాల మహానాడు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ జన్మదిన వేడుకలు డివిజన్ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో కేక్ కట్ చేసి రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ…..
సామాజిక ఉద్యమాల్లో అద్దంకి దయాకర్ చురుగ్గా పాల్గొన్నాడని, దళితుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేశాడని గుర్తు చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆయన శక్తివంచన లేకుండా కృషి చేశాడని తెలిపారు.
మాలలు, దళిత వర్గాల అభివృద్ధికి అద్దంకి దయాకర్ పాటుపడ్డాడని తెలిపారు.
అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించే విషయ పరిజ్ఞానం, నిబద్ధత కలిగిన దయాకర్ కు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా యూత్ నాయకులు యనమల రాకేష్, డివిజన్ అధ్యక్షులు గొడిశాల నవీన్, నాయకులు గారలాజర్, నెల్లికుదురు అధ్యక్షులు కారం ప్రశాంత్, నాయకులు చిట్టి మల్ల కిరణ్ ఎనమాల లక్ష్మి, ప్రసన్న కుమార్, చిట్టి మల్ల గోపి, బన్నీ మనో, శివకుమార్, వైద్యాధికారులు పాల్గొన్నారు.