వీఆర్ఏ వారసుల సమస్యలు పరిష్కరించాలి

18 నెలలుగా పోరాటం పట్టించుకోని ప్రజా ప్రభుత్వం.

దిక్కుతోచని స్థితిలో విఆర్ఏ ఉద్యోగులు

భూపాలపల్లి నేటిధాత్రి

విఆర్ఏ వారసుల సంఘం రాష్ట్ర నాయకులు, వీఆర్ఏ జేఏసీ జిల్లా చైర్మన్ చెన్నపురి హరీష్.

భూపాలపల్లి నేటిధాత్రి

విఆర్ ఏ వారసుల సమస్యలు పరిష్కరించాలని వీఆర్ఏ వారసుల సంఘం రాష్ట్ర నాయకులు,జయశంకర్ భూపాలపల్లి జిల్లా జేఏసీ చైర్మన్ చేన్నపురి హరీష్ ప్రభుత్వాన్ని కోరారు.
బుధవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్ కార్యాలయంలో వీఆర్ఏ సంఘం ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 20555 వీఆర్ఏ వారసులం ఉన్నామని తాతలు తండ్రుల నుండి గౌరవ వేతనం వచ్చేదని వారికి పే స్కేల్ వారసుల ఉద్యోగాలను జీవో నెంబర్ 81 85 తీసుకువచ్చి 20వేల 55 మంది వీఆర్ఏలలో 16,755 మందికి ఉద్యోగాలు కల్పించి మిగిలిన వారికి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిందని అన్నారు. అనేక పోరాటాల ఫలితంగా ముఖ్యమంత్రి, రెవిన్యూ శాఖామంత్రితో రెవెన్యూ అధికారులతో చర్చించి మీ న్యాయమైన సమస్యను త్వరగా పరిష్కారం అయ్యేటట్లు రూస్తామని హామీ ఇచ్చారని.గత ప్రభుత్వం అసెంబ్లీలో వీఆర్ఏ పే స్కేల్, వారసులకు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించి నిర్లక్ష్యం చేయడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏ లు 80 రోజుల పాటు చారిత్రాత్మకమైన మెరుపు సమ్మె చేయటంతో ప్రభుత్వం దిగివచ్చి వీఆర్ఏ జెఏసి నాయకులతో చర్చలు జరిపి జీవో నెం.81, 85ను విడుదల చేసిందనీ అన్నారు.ఆ జీవోల ప్రకారం మొత్తం 20,583 మంది లో డిగ్రీ చదివిన వారికి జూనియర్ అసిస్టెంట్ గా ఇంటర్మీడియట్ నదివిన వారికి రికార్డ్ అసిస్టెంట్లుగా పదో తరగతి చదివిన వారికి ఆఫీసు సబార్డినేటర్స్ రెవిన్యూతో పాలు మున్సిపల్ పంచాయతీరాజ్ ఇరిగేషన్ శాఖలో సర్దుబాలు చేసిందని, మిగిలిన 3,797 మంది 61 సంవత్సరాలు పైబడిన విఆస్ఏ వారసులకు ఉద్యోగాలు ఇస్తామని జీవోలో ప్రకటించి,నేటికీ వారసులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని. తండ్రుల స్థానంలో తమకు ఉద్యోగాలు వస్తాయని కుటుంబంలో ఉన్న ఆస్తులను ఒకరికి ఉద్యోగం ఒకరికి భూమి లేదా ఇల్లు పంపకాలు కూడా చేసుకున్నారు.ఉద్యోగం వస్తుందనే ఆశతో అప్పులు చేసి అన్నదమ్ములు లక్షలు పెట్టి కొనుకున్నారు.గత 18 నెలలుగా ఉద్యోగం కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ ఉద్యోగ సంఘాల చుట్టూ ఎమ్మెల్యే ఎంపీలు మంత్రులు ముఖ్యమంత్రి చుట్టూ కాలికి బలపం కట్టుకొని తిరిగి పత్రాలు ఇచ్చి దండం పెట్టి దరఖాస్తులు ఇచ్చినా ప్రభుత్వం నుండి ఎలాంటి సానుకూల స్పందన కనిపించలేదనీ అన్నారు.ఏఆర్ఎల సమస్యల పరిష్కారం కోసం ఐదు మంది ఐఏఎస్ ఆఫీసర్లతో నవీన్ మిట్టల్ చైర్మన్ కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీని నియమించిందని.కమిటీ నివేదిక ప్రభుత్వానికి సమర్పించిన నేటికీ విఆర్ఎ వారసుల ఉద్యోగాల ఉసే వినిపించడం లేదని అన్నారు. కమిటీ, ఎన్నికల పేరుతో, వర్షాలు వరదల పేరుతో కాలయాపన చేస్తూ వీఆర్ఏ జీవితంతో కాంగ్రెస్ పార్టీ అడుకుంటుందని.ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత 18 నెలలుగా వెనుకబడిన అట్టడుగు వర్గాలకు చెందిన విఆర్ఎ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఉన్న జీవోను కూడా అమలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం అయిందని అన్నారు. విఆర్ఎలు 80 రోజుల సమ్మె చేస్తున్న సందర్భంగా వారి సిఎల్పి నేత, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ప్రభుత్వానికి విఆర్ఎల సమస్యలు పరిష్కరించలని అసెంబ్లీలో ఇచ్చిన హామీ ప్రకారం పేస్సేల్ ఇచ్చి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని విఆర్ఎల తరఫున లేఖలు రాసినట్టు గుర్తు చేశారు.ఎన్నికలకు ముందు వీఆర్ఏ పోరాటానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి తమకు ఓటు వేస్తే అధికారం చేపట్టిన తక్షణమే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విఆర్ఎలకు ఇచ్చిన జీవోలు అమలు చేయకపోవడం అన్యాయంమనీ అన్నారు. ప్రభుత్వం జీవో నెం. 81, 85 ప్రకారం విఆర్ఎ వారసులకు తక్షణమే ఉద్యోగ ఉత్తర్వులు ఇవ్వాలని లేని యెడల వీఆర్ఎలంతా ఐక్యంగా రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలకు సిద్ధం అవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వీఆర్ఏ జేఏసీ వైస్ చైర్మన్ గడ్డం రమేష్,జనరల్ సెక్రెటరీ భూతం రాజు ,మధు,రమేష్,సతీష్,బోగి రాజు కుమార్ కర్ణ మేనక,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!