నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి:
రాబోయే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో చేతివృత్తిదారుల సంక్షేమం వృత్తి రక్షణ కోసం జనాభా ప్రాతిపదికన బడ్జెట్లో నిధుల వాటా పెంచాలని వృత్తిదారుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు బండ శ్రీశైలం, జిల్లా కన్వీనర్ గంజి మురళీధర్ డిమాండ్ చేశారు. శనివారం నాడు నల్లగొండలో జరిగిన చేతి వృత్తిదారుల సంఘం సమావేశంలో వారు మాట్లాడుతూ వృత్తి దారులకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేసి వాటికి పాలకమండలి ఏర్పాటు చేసి విధి విధానాలు ప్రకటించాలని అన్నారు. వృత్తిదారులలో ఉన్న నిరుపేదలకు గృహలక్ష్మి పథకం అమలు చేయాలి ,అన్ని వృత్తుల వారికి బీసీ బందు ఇవ్వాలి, 50 సంవత్సరాలు నిండిన ప్రతి వృత్తిదారునికి 5000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి, భూమిలేని వృత్తిదారులందరికీ మూడు ఎకరాల భూమి ఇవ్వాలి ,ప్రతి వృత్తిదారునికి 10 లక్షల రూపాయలు జీవిత బీమా ఇవ్వాలి ,గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేయాలి, చేతి వృత్తిదారుల కుటుంబాలకు విద్యా వైద్యం ఉచితంగా అందించాలని పై డిమాండ్లన్నింటినీ వివిధ రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వృత్తి సంఘాల నాయకులు అవిశెట్టి శంకరయ్య, కందగట్ల గణేష్, కొండ వెంకన్న, శ్రీనివాస్, పెద్దలు, మల్లేశం, ఐలయ్య, కర్నాటి శ్రీరంగం తదితరులు పాల్గొన్నారు.