Woman’s Unique Use of Washing Machine Goes Viral
వాషింగ్ మెషిన్‌ను ఇలా కూడా వాడతారా.. ఈమె ఏం చేసిందంటే..
సాధారణంగా చాలా మంది ఇళ్లలో వాషింగ్ మెషిన్ ఉంటుంది. దానిని అందరూ బట్టల ఉతకడానికి మాత్రమే ఉపయోగిస్తారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక మహిళ వాషింగ్ మెషిన్‌ను వెరైటీగా ఉపయోగించింది.
మనదేశంలో చాలా మంది సామాన్యులు అసామాన్యంగా ఆలోచిస్తుంటారు. క్లిష్టమైన సమస్యలకు సులభమైన పరిష్కారాలు కనుగొంటారు. తమ రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను తమ తెలివితో పరిష్కరిస్తుంటారు. శ్రమతో కూడుకున్న పనులను సులభంగా పూర్తి చేసి ఇతరులను ఆశ్చర్యపరుస్తుంటారు. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది (Indian creativity).
adityasaloni2015 అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సాధారణంగా చాలా మంది ఇళ్లలో వాషింగ్ మెషిన్ ఉంటుంది. దానిని అందరూ బట్టల ఉతకడానికి మాత్రమే ఉపయోగిస్తారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక మహిళ వాషింగ్ మెషిన్‌ను వెరైటీగా ఉపయోగించింది. ఒక మహిళ కాస్త వెరైటీగా ఆలోచించి వాషింగ్ మెషిన్‌ను గోధుమలను ఆరబెట్టడానికి ఉపయోగించింది. ఆమె గోధుమలను ఒక వస్త్రంలో వేసి దానిని వాషింగ్ మెషిన్లో ఉంచి డ్రై చేసింది (amazing hack).
