BT Road Collapses Within 24 Hours
ఇది బీటీ రోడ్డు.. మట్టి రోడ్డు?
నూతన బీటి రోడ్డు శిథిలం.. తాండవాసుల ఆందోళన
బాలానగర్ / నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని బోడగుట్ట తండా గ్రామపంచాయతీ పరిధిలోని దేవుని గుట్ట తండాకు బుధవారం సాయంత్రం బీటీ రోడ్డు నిర్మించారు. 24 గంటలు ముగియక ముందే బీటీ రోడ్డు బీట్లు బీట్లుగా పైకి లేచింది. నాణ్యత లేని రోడ్డు నిర్మించారని తాండావాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చుపెట్టి గ్రామీణ ప్రాంతాలలో ప్రాంతాలకు బీటీ రోడ్డు నిర్మిస్తే.. కాంట్రాక్టర్లు నాణ్యతలేని బీటీ రోడ్డు నిర్మించి ప్రజాధనం వృథా చేస్తున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి నాణ్యతతో కూడిన బీటీ రోడ్డు నిర్మించాలని తండావాసులు ఆనంద్ నాయక్, సంతోష్ నాయక్, రమేష్ నాయక్, శ్రీను నాయక్, కిరణ్ నాయక్ కోరారు.
