పునర్విభజన ఇప్పట్లో లేనట్టే!?
`జమిలి ఎన్నికలకు రాష్ట్రాల అనుమతి అవసరం లేదు?
`‘‘లా కమిషన్’’ సూచించినట్లు సమాచారం?
`ఎలాంటి రాజ్యాంగ సవరణ అవసరం లేదని కూడా తెలుస్తోంది?
`జమిలి ఎన్నికలు జరపాలన్న పట్టుదలతో కేంద్రం వుంది?
`జనాభా లెక్కలకే చాలా సమయం పట్టేలా వుంది?
`నియోజక వర్గాల పునర్విభజన మరింత సమయం తీసుకుంటుంది?
`అప్పటికి లోక్ సభ పదవీ కాలం ముగుస్తుంది?
`జనాభా ప్రకారం పునర్విభజన చేస్తే దక్షినాదికి అన్యాయం జరగొచ్చు?
`బీజేపీ మీద వ్యతిరేకత పెరగొచ్చు?
`ఒక సంవత్సరం ఎన్నికల వాయిదా సాధ్యం కాకపోవచ్చు?
`పునర్విభజన తర్వాత జమిలి సమస్య కావచ్చు?
హైదరాబాద్, నేటిధాత్రి: మళ్లీ తెరమీదకు జమిలి! ఆరు నెలలకోసారైనా ఈ అంశం మీద రచ్చ జరుగుతున్నదే. జాతీయస్దాయిలో మొదలైన మళ్లీ చర్చ మొదలైంది. కాని ఇకపై జమిలీ ఎన్నికలపై త్వరలో ఒక స్పష్టత వచ్చే అవకాశం కూడా వుంది. ఎందుకంటే జమిలీ ఎన్నికలకు దేశంలోని కనీసం 14 రాష్ట్రాల అనుమతి అవసరమని, అసెంబ్లీ తీర్మాణాలు తప్పని సరి అని అనుకున్నారు. కాని ఈ మధ్య లా కమీషన్ దేశంలో జమిలీ ఎన్నికలకు రాష్ట్రాల అసెంబ్లీ తీర్మాణాలు అవసరం లేదని చెప్పినట్లు సమాచారం. జమిలీ ఎన్నికల మీద మోడీ సర్కారు జాయింటు పార్లమెంటు సభ్యుల కమిటీ వేసింది. దానికి మాజీ రాష్ట్ర పతి రామ్నాద్ కోవింద్ అధ్యక్షుడిగా నియమించారు. ఆ కమిటీ సరిగ్గా ఏడాది కాలంలో తన నివేదికను ఇచ్చారు. ఆ కమిటీ సిఫారుసులను లా కమీషన్‌కు కేంద్రం తీసుకెళ్లింది. ఆ కమిటీ రిపోర్టును పూర్తిగా అద్యయనం చేసిన లా కమీషన్ జమిలీ ఎన్నికలు ఎప్పుడైనా నిర్వహించుకోవచ్చని చెప్పినట్లు తెలుస్తోంది. అందుకు కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణమైన అధికారం వున్నట్లు తెలిసింది. దాంతో ఇక జమిలీకి వేగంగా అడుగులు వేయాలని కేంద్రం చూస్తున్నట్లు కూడా జాతీయ స్దాయిలో చర్చలు జరుగుతున్నాయి. అయితే జమిలీకి ముందే నియోజకవర్గ పునర్విభజన పూర్తి చేయాలని అనుకున్నారు. కాని ఇప్పుడు డి లిమిటేషన్ ప్రక్రియ కన్నా ముందే ఎన్నికలకు వెళ్లనున్నట్లు సమాచారం. నిజానికి 2034 తర్వాతే జమిలి అంటూ గతంలో చెప్పారు. కాని పదే పదే జమలి ఎన్నికల ప్రస్తావన వచ్చేలా చేశారు. 2027లోనే జమిలి ఎన్నికలు జరపాలని కోరుకుంటున్న బిజేపి. జనాభా లెక్కలు 2027లో పూర్తి చేయాలి. ఆపై నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. ఆ తర్వాతే జమిలి అని గతంలో వినిపించింది. వాటి కంటే ముందే జమిలి పూర్తి చేయాలని బిజేపి యోచిస్తోందని సమాచారం. నియోజకవర్గాల పునర్విభజన దక్షిణాన సమస్యలు సృషించే అవకాశం వుంది. ఇంకా ఆగితే దేశంలో బ్యాలెట్ ఎన్నికలు కావాలని ఉద్యమాలు వచ్చే అవకాశం వుంది. ఇప్పటికే ఈవీఎం వల్ల తమకు నష్టం జరుగుతోందని ప్రతిపక్షాల ఆందోళన. కాంగ్రెస్‌పార్టీ ఈ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకురావాలని అనుకుంటోంది. బిజేపి ప్రధాన ఎజెండాలలో కొన్ని పూర్తయ్యాయి. రామజన్మ భూమిలో గుడి కట్టేశారు. కశ్మీర్‌కు వున్న ప్రత్యేక ప్రతిపత్తి తొలగించారు. ఆర్టికల్ 370 రద్దు చేశారు. పెద్ద నోట్లు రద్దు చేశారు. దేశమంతా జిఎస్టీ ఒకే విదానం తెచ్చారు. ఇక మిగిలింది జమిలీ ఎన్నికలు. ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు జమిలి ఎన్నికలు 2027లోనే జరిపే యోచన చేస్తున్నట్లు మరోసారి చర్చ మొదలైంది. జాతీయ మీడియాలో ఈ వార్తలు మళ్లీ చక్కర్లు కొడుతున్నాయి. మళ్లీ తెరమీదకు జమిలి! ఎన్నికల విషయం వెలుగులోకి వచ్చింది. ఈ చర్చకు బలం చేకూరేలా ఆ మధ్య కాలంలోనే సిఎం.రేవంత్‌రెడ్డి కూడా ప్రస్తావించారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల వేళ తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో ఈ విషయాన్ని గుర్తు చేశారు. ఈసారి జమిలి ఎన్నికలు వుండొచ్చన్న సూటిగానే చెప్పారు. కాని ఆ రోజు మీడియా ఆయన మాటలను పెద్దగా పట్టించుకోలేదు. సిఎం. రేవంత్ రెడ్డి నోట వినిపించిన ఆ మాటకు మీడియా పెద్దగా ప్రాదాన్యతనివ్వలేదు.. జమిలీ ఎన్నికులు జరిగే అవకాశం వుంటే ఎన్నికలు ఒక ఏడాది పాటు వెనక్కివెళ్లొచ్చని రేవంత్ అన్నారు. కాని అది సాధ్యం కాదు. కేంద్రం ఒక ఏడాది ఎన్నికలు వాయిదా వేయడం సులువైన పని కాదు. సాధ్యమయ్యే పని అసలే కాదు. ఎందుకంటే కేంద్రంలో ప్రతిపక్షం బలంగా వుంది. ఎన్టీయే అనుకున్నంత బలంగా లేదు. బిహార్ ఎన్నికల్లో బిజేపి విజయ దుందిబి మోగించింది. దాంతో మళ్లీ జాతీయ స్దాయిలో ఈ చర్చ ఊపందుకున్నది. నిజానికి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగానే జమిలీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటోంది. కాని కొన్ని అభ్యంతరాలు నేపధ్యంలో వాటిని వాయిదా వేస్తున్నట్లు మాత్రమే ప్రకటించింది. గతంలో 2034 తర్వాతే జమిలి అంటూ చెప్పడం జరిగింది. కాని పదే పదే జమలి ఎన్నికల ప్రస్తావన వచ్చేలా మాత్రం చేస్తున్నారు.. 2027లోనే జమిలి ఎన్నికలు జరపాలని కేంద్ర ప్రభుత్వం బలంగానే కోరుకుంటున్నట్లుంది. అయితే జనాభా లెక్కలు 2027లో పూర్తి చేయాలి. ఆ వెంటనే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని అనుకున్నారు. కాని నియోజకవర్గాల పునర్విభజన కూడా అంత సులువైన పని కాదు. దాని కోసం కనీసం ఏడాదిన్న సమయం పడుతుంది. అలా జరగాలంటే 2029 వరకు కూడా ఎన్నికలు నిర్వహించం సాద్యం కాదు. అందువల్ల జమిలీ నిర్వహణ తొలుత అనుకున్నట్లు 2034 వరకు వాయిదా వేయాల్సివుంటుంది. అది బిజేపి విదానం కాదు. ఒకసారి బిజేపి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానిపై వెనక్కి వెళ్లడం అనేది జరగదు. 2014 ఎన్నికలకు ముందే కొన్ని నిర్ధిష్టమైన విషయాలను ఎంచుకున్నారు. వాటిలో ఒక్కొక్కటీ పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఇక మిగిలింది జమిలీ మాత్రమే. ఇప్పటి వరకు అనుకున్న వన్నీ పూర్తి చేస్తూ వచ్చారు. అందువల్ల ముందే జమిలీ నిర్వహించి, నియోజక వర్గాల పునర్విభన వెనక్కి నెట్టాలని అనుకుంటున్నారు. నియోజకవర్గాల పునర్విభజన దక్షిణాన సమస్యలు సృషించే అవకాశం వుందని బిజేపి భావిస్తోంది. ఇప్పటికే దీనిపై తమిళనాడులో పలు సార్లు ఆందోళనలు కూడా జరిగాయి. తమిళనాడు సిఎం. స్టాలిన్ ఈ అనుమానం అనేక సార్లు లేవనెత్తారు. అయితే గతంలో తమిళనాడులో పర్యటించిన అమిత్‌షా ముందస్తు సంకేతంగా దక్షిణాదిలో సీట్లు తగ్గవు అనే ప్రకటన చేశారు. జనాభా ప్రాతిపదికన నియోజక వర్గాల పునర్విభజన జరిగితే సీట్లు ఖచ్చితంగా తగ్గుతాయనే అనుమానం వుంది. ఆ అనుమానం వద్దని అమిత్‌షా చెప్పారు. అంటే పరక్షంగా ఇప్పట్లో పునిర్వభజన లేదని చెప్పినా అంత జమిలీ కోసం వాయిదా వేస్తారని ఎవరూ ఊహించలేదు. ఇప్పటికీ దక్షిణాది రాష్ట్రాలలో అనుమానం వెంటాడుతూనే వుంది. ఎందుకంటే జనాభా నియంత్రణలో దక్షిణాది ముందుంది. కాని ఉత్తరాదిలో మాత్రం జనాభా గణనీయంగా పెరిగింది. జనాబా ప్రాతిపదికన నియోజకర్గాల విభజన జరుగుతుంది. దాంతో దక్షిణాదిన చాలా సీట్లు తగ్గిపోతాయి. ఉత్తరాది సీట్లు పెరుగుతాయి. అప్పుడు దక్షిణాది మీద ఉత్తరాది పెత్తనం మరింత పెరుగుతుంది. దీనిని భరించేందుకు దక్షిణాది రాష్ట్రాలు సిద్దంగా లేవు. ఇప్పటికే ఈ విషయం మీద కేంద్రానికి అల్టిమేటమ్ రాజకీయ పార్టీలు జారీ చేస్తూనే వున్నాయి. ఈ మాత్రం తేడా వచ్చినా మొదటికే మోసం వస్తుంది. జమిలీ ఎన్నికలకు వీలు లేకుండాపోతుంది. పైగా జమిలీ ఎన్నికల నిర్వహణ ఆలస్యం చేస్తే మరో ఉపద్రవం కూడా వచ్చే ప్రమాదం వుంది. దేశంలో బ్యాలెట్ ఎన్నికలు కావాలని ఉద్యమాలు వచ్చే అవకాశం వుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఇప్పటికే ఈవీఎం వల్ల తమకు నష్టం జరుగుతోందని ప్రతిపక్షాల ఆందోళన మొదలుపెట్టాయి. బ్యాలెట్ ఓటింగ్ కావాలని పట్టుబడుతున్నాయి. అమెరికా లాంటి దేశాలు కూడా బ్యాలెట్ దారి పట్టనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో కాంగ్రెస్‌పార్టీ ఈ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకురావాలని అనుకుంటోంది. అందువల్ల బిజేపి వీలైనంత తొందరగా జమిలీ ఎన్నిలు తేవాలని చూస్తోంది. బిజేపి పార్టీకి, ప్రభుత్వానికి కొన్ని ప్రధాన ఎజెండాలున్నాయి. వాటిలో రామజన్మ భూమిలో గుడి నిర్మాణం జరిగింది. కశ్మీర్‌కు వున్న ప్రత్యేక ప్రతిపత్తి తొలగించారు. రాష్ట్ర హోదా తొలగించారు. ఆర్టికల్ 370 రద్దు చేశారు. పెద్ద నోట్లు రద్దు చేశారు. దేశమంతా జిఎస్టీ ఒకే విదానం తెచ్చారు. ఇక దేశమంతా పౌరులందరికీ ఒకే విదమైన హక్కులుండాలి. ఇక ఆఖరుకు మిగిలింది జమిలీ ఎన్నికలు. జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే 400 సీట్లు సంపాదించుకోగలమని బిజేపి నమ్మకం. అందుకే ముందు జమిలీ ఎన్నికలు నిర్వహించి, మరోసారి కేంద్రంలో అదికారంలోకి రావాలని కోరుకుంటోంది.
