`రిజిస్ట్రేషన్ శాఖ లో పెచ్చరిల్లుతున్న అవినీతి?
`గతంలో కంటే మరింత పెరిగిన లంచాలు?

`రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల అవినీతి బాగోతాలు.! వరుస కథనాలు మీ ‘‘నేటిధాత్రి’’లో త్వరలో.
` ఔటసోర్సింగ్, ప్రైవేటు వ్యక్తులదే పెత్తనం?

`అవినీతి ఆగింది లేదు.. ప్రక్షాళన జరిగింది కాదు?
`అటు ట్రాన్స్ ఫర్లు.. ఇటు డిప్యూటేషన్లు!

`ట్రాన్సఫర్లు చేసి ఏం లాభం? ఎక్కడి వాళ్ళు అక్కడే ఉద్యోగం?
`కమీషనర్ ట్రాన్స్ ఫర్ చేస్తే.. ‘‘డిఐజి’’ లు డిప్యూటేషన్ ఇచ్చే?
`‘‘ఏసిబి’’ కి చిక్కిన వాళ్ళ స్థానంలో అవుట్ సోర్సింగ్ కొలువులు?
`వారికి సపోర్ట్ గా రిజిస్టార్ల డ్రైవర్లు, ప్రైవేటు సిబ్బంది?
`లంచాల దారి మారింది.. కొత్త దారి పడిరది?
`రిజిస్ట్రేషన్ శాఖ ప్రజాధనం పంచుకోవడానికే పెట్టినట్లు వుంది?
`రిజిస్ట్రార్లు దోచుకోవడానికే రిజిస్ట్రేషన్లు జరుతున్నట్లు వుంది?
`అక్రమ రిజిస్ట్రేషన్ల మీద సమాధానం ఇవ్వరు?
`తూతూ మంత్రంగా ఆడిట్ విభాగం?
`అవినీతి జరిగిన చోట స్పెషల్ అడిట్ జరుపరు?
`వందల మంది ‘‘ఏసీబి’’ కి పట్టుబడ్డారు?
`అక్కడ ‘‘స్పెషల్ అడిట్’’ ఇంత వరకు జరిగింది లేదు?
`రిజిస్ట్రేషన్ శాఖ లో ‘‘ఆర్ టిఐ’’ పిటిషన్లకు దిక్కేలేదు?సమాధానం ఇచ్చేవారే లేరు?
`కింది నుంచి పైదాకా పంపకాలు?
`జనం నెత్తిన చేతులు?
`దర్జాగా లంచాలు వసూలు?
`భయం లేకుండా పోయిన అవినీతి రాక్షసులు?
`డాక్యుమెంట్ రైటర్లతో బేరసారాలు?
`డ్రైవర్లతో డబ్బుల మూటలు?
`నెలకు లక్షలకు లక్షలు లంచాలు?
హైదరాబాద్, నేటిధాత్రి:
లంచం. లంచం. ఇచ్చి, ఇచ్చీ జనాలకు కోపం వస్తోంది. వినీ వినీ సమాజానికి పిచ్చెక్కిపోతోంది. రాసి రాసి పత్రికలకు చేతులు నొప్పులు పుడుతున్నాయి. కాని పై స్ధాయి అదికారులకు కనిపించడం లేదు. పాలకులకు వినిపించడం లేదు. ఇదే మన దౌర్భాగ్యం. జీవితం అనుకునే దాకా వెళ్తోంది. చిన చేపను పెద చెప, పెద చెపను తిమింగలం అన్నట్లు వ్యవస్దలో లంచావతారులు పెరిగిపోయారు. అనకొండను మంచి మింగుతున్నారు. ఇక అవినీతి ఎక్కడ ఆగిపోతుంది. దానికి పుల్‌స్టాప్ ఎక్కడ పడుతుంది. పాలకులు పట్టించుకునే తీరికలో వుండరు. ప్రతిపక్షాలు లంచాల మీద పోరాటం చేయారు. ఎందుకంటే అందరూ ఆ తాను ముక్కలే. ప్రజా సంఘాలకు పని లేదు. బాదితులకు అండగా ఎవరూ లేరు. అందుకే అవినీతి యదేచ్చగా సాగిపోతూనేవుంది. సమాజం వెర్రి మాలోకం. లంచం ఇవ్వకుండా వుండలేరు. లంచాలు ఇచ్చుకునే స్దితిలో లేరు. అయినా అప్పులు చేసిన మరి అదికారులు జేబులు నింపుతున్నారు. అవినీతిని పెంచి పోషిస్తున్నారు. పాలకులు చర్యలు తీసుకోలేరు. అవినీతి నిరోదక శాఖ చేతులు చిన్నవి. పనులు పెద్దవి. పైగా అందులోనూ ఆ చీడ పెరిగిందనే వార్తలూ వస్తున్నాయి. ఆ పీడను ఆ శాఖను పట్టిపీడిస్తోందని అంటున్నారు. ఇక ఎవరు అవినీతిని అంతం చేసేది? ఎవరు అవినీతిని ఆపేది? ఎన్నికలు రాగానే రాజకీయ పార్టీలు చెప్పే మొదటి మాట. గెలిచిన తర్వాత మర్చిపోయే తొలి ముచ్చట ఇదే. అందుకే అవినీతి అనేది హద్దూ బద్దూలేకుండా సాగిపోతోంది. కింది నుంచిపై స్ధాయిదాకా పంచబడుతోంది? ఏ శాఖ అధికారులను కదిలించినా తీసుకునే లంచంలో మాకు మిగిలేదెంద? ఇసుమంతా? తీసుకోవడం వరకు మాత్రమే మా చేతులు, పంచుకునేదంతా పై చేతులు? అని ఉద్యోగులు అంటున్నారు. ఇక అవినీతి ఎలా ఆగుతుంది? పాలకులకు ఏనాడు చిత్తశుద్ది వుండదు. అందుకే యదేచ్చగా అవినీతి సామ్రాజ్యం ఊడల మర్రిలా విస్తరించింది. ఎంత కొట్టేసినా చిగురిస్తూనే వుంటుంది. అందులో రెండు మూడు శాఖలు ప్రధానమైనవి. వాటిలో రిజిస్ట్రేషన్ శాఖ చెప్పుకోదగింది. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి తగ్గిందని అందరూ భావించారు. కాని ఎక్కడా ఆగలేదు. తగ్గలేదు. పైగా మరింత పెరిగింది. విచ్చలవిడిగా ఆ శాఖ లంచాలమయమైంది. గతంలో చాటు మాటుగా సాగే వ్యవహారం అంతా బహరంగంగానే జరుగుతోంది. పట్టుబడే వారు పట్టుబడుతూనే వున్నారు. వందల సంఖ్యలో ఉద్యోగులు పట్టుబడ్డారు. ఇప్పుడు అవినీతి చేస్తున్న రిజిస్ట్రార్లకు అది వరంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగులతో జరిగే అవినీతి కన్నా, రిజిస్ట్రేషన్‌లో ఔట్ సోర్సింగ్ ద్వారా చేరిన ఉద్యోగులు, రిజిస్ట్రార్ల డ్రైవర్లు, ప్రైవేటు సైన్యం, రైటర్లలతో కూడిన కొత్త సామ్రాజ్యం ఏర్పాటైంది. ఇంకే ముంది గతంలో మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగిన అవినీతి ఇప్పుడు ఆరు పువ్వులు, అరవై కాయలుగా మారింది. దండుకోవడానికి రాజ మార్గం పడినట్లైంది. తెలంగాణలోని ప్రతి రిజిస్ట్రేషన్ కార్యాలయ పరిదిలో పనిచేసే రైటర్లదే రాజ్యంగా మారింది. రిజిస్ట్రేషన్‌కు వెళ్లిన వారికి రైటర్లు చెప్పిందే లెక్క. నిజానికి డాక్యుమెంటు రైటర్ల వ్యవస్ధను ఏనాడో తొలగించారు. అది కాగితాల వరకు మాత్రమే? కాని ఎక్కడ వేసిన గొంగలి అక్కడే వుంది. డాక్యుమెంటు రైటర్లు మరింత పెరిగారు. డాక్యుమెంటు రైటర్లు చేసే పనిని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు తప్పించుకుంటున్నారు. లంచాలు పంచుకోవడం కోసం మాత్రమే వాళ్లు ఉద్యోగం చేస్తున్నారు. మూటలు మోయడానికి మాత్రమే వారు పరిమితయ్యారు. ఇక ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, రిజిస్ట్రార్ల ప్రైవేటు సైన్యం మొత్తం డాక్యుమెంటు రైటర్ల మీదే ఆదారపడి పని చేస్తున్నారు. దాంతో అన్నీ రైటర్లే చూసుకుంటున్నారు. తమ రాజ్యం సాగిస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్‌కు ఎంత ముట్టజెప్పాలి? అనే బేర సారాలు కూడా డాక్యుమెంటు రైటర్లే చేసి పెడుతున్నారు. ఆ పని కూడా ఉద్యోగులకు, సబ్ రిజిస్ట్రార్లకు ఆ పని కూడా తప్పిస్తున్నారు. రిజిస్ట్రార్ల సేవలో తరిస్తూ, స్వామి కార్యం, స్వకార్యం రైటర్లు తీర్చుకుంటున్నారు. అందుకే రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి ఆగింది లేదు. ప్రక్షాళన సాధ్యం కాదని శాఖ పెద్దలు చేతులెత్తేసినట్లున్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉద్యోగుల ట్రాన్సఫర్లు పెద్దఎత్తున చేశారు. అది కూడా జోన్ల వారిగా చేపట్టారు. కాని ఏమైంది. ట్రాన్స్ఫర్లు అయితే జరిగాయి. కాని ఆదేశాలు అమలు కావడం లేదు. తూతూ మంత్రంగా ట్రాన్స్ఫర్ అయిన కార్యాలయాలకు వెళ్లారు. మళ్లీ పాత స్దానాలకు డిప్యూటేషన్ల మీద వచ్చి కూర్చున్నారు. ఆగ మేఘాల మీద కమీషనర్ ఎంత వేగంగా ట్రాన్స్ఫర్లు చేశారో..అంతే శీఘ్రంగా జిల్లా డిఐజీలు వారికి డిప్యుటేషన్లు ఇచ్చేశారు. ఇంకేముంది. గతంలో ఎక్కడ పాతుకుపోయి పనిచేశారో అక్కడికే మళ్లీ చేరారు. చేతి వాటం మరింత గట్టిగా చూపిస్తున్నారు. ఇక ట్రాన్స్ఫర్లు చేసి ఏం లాభం? ఎక్కడి వాళ్లు అక్కడ ఉద్యోగం చేస్తుంటే అవినీతి ఎలా ఆపగలం. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అంటే ఇదే కాదా? లంచాలకు అలవాటు పడిన ఉద్యోగులందరూ అనుసరించే బాటనే కదా? నిజం చెప్పాలంటే ఎక్కువగా రిజిస్ట్రేషన్లు, పెద్దఎత్తున అవినీతి లావాదేవీలు జరిగే రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో తక్కువ సోదాలు జరుగుతుంటాయి? తక్కువ రిజిస్ట్రేషన్లు జరిగే కార్యాలయాల్లో ఎక్కువ సోదాలు జరుగుతుంటాయి. అవినీతి నిరోదక శాఖ పనిచేస్తున్నట్లు వుంటుంది. లంచావతారులను పట్టుకుంటున్నట్లు వుంటుంది. యదావిధిగా జరగాల్సింది జరిగేందుకు పరోక్షంగా ఏసిబి కూడా వారికి సహకరించినట్లూ వుంటుంది? ఎందుకంటే ఇటీవల పట్టుబడిన అనేక మంది అవినీతి నిరోదకశాఖ అధికారులు కూడా అదే దారిలో వెళ్తున్నారన్న మాటలు చెబుతున్నారు. దాంతో ఏసిబిని కూడా నమ్మే పరిస్టితి లేకుండాపోతోంది. ఎందుకంటే పట్టుబడిన ఉద్యోగులు మళ్లీ ఎలా ఉద్యోగాలలో చేరుతున్నారు. అవినీతి చేస్తూ లంచాలు తీసుకుంటూ పట్టుబడిన వారికి ఎందుకు శిక్షలు పడడం లేదు? ఎందుకు వారి ఉద్యోగాలు పోవడం లేదు? అంటే పట్టుకోవడం వరకే తమ పని అన్నట్లుగా ఏసిబి ఎందుకు వ్యవహరిస్తోంది? అనే ప్రశ్నలు కూడా సమాజంలో వినిపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే రిజిస్ట్రేషన్ శాఖలు లంచాలు తీసుకోవడానికే పెట్టినట్లు వున్నాయి. కొందరు రిజిస్ట్రార్లు దోచుకోవడానికే కార్యాలయాలు నడుస్తున్నట్లున్నాయనిపిస్తోంది. పెద్దఎత్తున అవినీతి జరుగుతున్నా, ఆరోపణలు వినిపిస్తున్నా విజిలెన్స్ దాడులు పెద్దగా జరిగేది లేదు. జరిగినా ఆ నివేదికలు బైటకు వచ్చేవి కాదు. వచ్చినా చర్యలు తీసుకుంటున్న దాఖలాలు పెద్దగా లేదు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ శాఖలో పై స్దాయి ఉద్యోగులే విజిలెన్స్ అధికారులు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పై స్దాయి ఉద్యోగులే విజిలెన్స్ విభాగంగా పనిచేస్తుంటారు. అంటే ఏమిటి? దొంగ చేతికి తాళాలు ఇస్తే దొంగతనం జరగదని అనుకోవడం భ్రమ. దర్జాగా దొంగతనం జరిగేందుకు ఇదో రహదారిగా మారింది. ఇక పెద్దఎత్తున అవినీతి జరిగిన రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో జరిగిన రిజిస్ట్రేషన్లపై ఆడిట్ జరగకపోవడం విడ్డూరం. నిజానికి త్రైమాసిక కాలంలో ఆడిట్లు జరగాలని వుంది. కాని ఎక్కడా జరిగినట్లు దాఖలాలు కనిపించవు. అవినీతి నిర్ధారణలు చేసినట్లు వార్తలు వినిపించవు. అవినీతి జరిగిన చోట ఎందుక ఆడిట్ జరపరు అనే ప్రశ్నలు ఎన్ని వినిపించినా పై స్ధాయి అదికారులు స్పందించరు. స్పెషల్ ఆడిట్లు జరిగినట్లు చెప్పుకోవడానికి ఏమీ వుండదు. ఇక మరో ఆసక్తి కరమైన విషమేమిటంటే ఒక సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరిగిన రిజిస్ట్రేషన్లపై ఆర్టీఐకి దరఖాస్తు చేసుకున్నా స్పందించేవారు వుండదు. అసలు సమాదానం ఇవ్వరు. ఇదీ మన రిజిస్ట్రేషన్ శాఖ తీరు. ఎప్పటికీ మార్పు రాదు. పాలకులు మారినా ఉద్యోగులు అవినీతి ఆపరు. పట్టుబడుతున్నా భయపడరు. ఉద్యోగం పోతుందన్న భయం ఎవరిలో వుండదు. నాలుగు రోజులు పోతే అదే కుర్చీలో కూర్చుంటారు. లంచాలతో పట్టుబడిన ఉద్యోగి, లంచాలు ఇచ్చి ఉద్యోగం తెచ్చుకొని మళ్లీ లంచాలు తింటాడు. అంతకుముందు కన్నా మరింత లంచాలు వసూలు చేస్తారు? ఇదీ వ్యవస్ద తీరు…!
