ఇరిగేషన్ అధికారులతో కలిసి కాలువను పరిశీలించిన ప్రభుత్వ విప్
గొల్లపల్లి నేటి ధాత్రి:
గొల్లపెల్లి మండలం రాఘవపట్నం గ్రామంలోని కాకతీయ డి64 కెనాల్ నీ శుక్రవారం రోజున ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండల నాయకులు,అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..
గత ప్రభుత్వ హాయంలో ధర్మపురి తలాపున గోదావరి ఉన్న ఇక్కడి రైతాంగానికి సాగు నీరు అందని పరిస్థితి ఉండేదని,కెనాల్స్ ద్వారా ఇక్కడి ప్రాంత రైతాంగానికి నీరు అందించే సౌకర్యం ఉన్నప్పటికి కానీ గత ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అట్టి కెనాల్ లో పిచ్చి మొక్కలు పెరిగి,చెత్త చెదారం చేరి నీరు అందకుండా ఉండటం,గత సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు గండిపడి రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురికావడం జరిగిందనీ,ఇట్టి విషయం పై ధర్మపురి నియోజకవర్గ రైతాంగానికి పంటలు ఎండిపోకుండా డి 53, డి 64, డి 83- ఏ ,డి 83- బి నందిమేడారం, డి-63, డి-65, డి-67 టెలాండ్ వరకు ప్రతి ఎకరాకు నీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి వివరించడం జరిందని, అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి విచారణ జరిపించాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది,ధర్మపురి నియోజకవర్గంలోనీ చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముస్కు నిశాంత్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతి,మహేష్,విజయ్,దిలీప్,రమేష్ రెడ్డి,పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..