తప్పు మీదే!

బాధ్యతలేని తల్లిదండ్రులే పిల్లలకు శాపం

పిల్లలను ఎల్లవేళలా కనిపెట్టుకొని వుండాలి

మితిమీరిన ఆంక్షలు, అతిస్వేచ్ఛ రెండూ పనికిరావు

పిల్లల అభిప్రాయాలకు విలువ ఇవ్వండి

సక్రమంగా జీవించడం నేర్పండి…ప్రతివిషయంలో కలుగజేసుకోవద్దు

అంబరిల్లా పేరెంట్‌షిప్‌ పనికిరాదు

ప్రేమ పేరుతో క్రెడిట్‌కార్డులు, పాకెట్‌ మనీ విచ్చలవిడిగా ఇవ్వొద్దు

ఏది అవసరమో అది ఇవ్వండి…కోరుకున్న ప్రతిదాన్ని ఇవ్వక్కరలేదు

చెడు అలవాట్ల బారిన పడకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి

తప్పు మీపై వుంచుకొని పోలీసులను, ప్రభుత్వాన్ని నిందించి లాభంలేదు

ఎవరి జీవితం వారిదే…ఒకరితో పోల్చుకోవద్దు

జీవితం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి

హైదరాబాద్‌,నేటిధాత్రి:
స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లే తమ పిల్లలు వారాంతాలు లేదా ఖాళీ సమయాల్లో ఎక్కడి వెళుతున్నా రు? ఏం చేస్తున్నారు? వారి ప్రవర్తనాశైలి ఎట్లా వుంటున్నది? మొదలైన అంశాలను నేటికాలపు తల్లిదండ్రుల్లో చాలమంది పట్టించుకోవడంలేదన్నది మాత్రం అక్షరసత్యం. తండ్రి సంపాదనపై, తల్లి చిట్టీపార్టీలు ఇతర వ్యాపకాలపై దృష్టి కేంద్రీకరించి, పిల్లల్ని స్కూల్‌కి లేదా కళాశాలకు పంపడంతో తమ బాధ్యత తీరిందనుకునే మనస్తత్వాల వల్ల బాధ్యతాయుతమైన కింది తరం ఎట్లా తయారవుతుంది? తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగస్తులైతే వారి సంతానం కూడా వారిలాగానే యాంత్రికంగా మారిపోతారు. పొద్దున్నే లేవడం, స్కూల్‌కో కాలేజీకో వెళ్లడం రావడం వంటి రొటీన్‌ కార్యక్రమంతో వాళ్ల దినచర్యలు సాగుతుంటాయి. మిగతా వృత్తుల్లో వున్న తల్లిదండ్రులు కూడా క్షణం తీరికలేని జీవితాలు గడుపుతుండటంతో తమ సంతానం పట్ల శ్రద్ధవహించే సమ యం కూడా వారికుండటంలేదు. ఇటువంటి కుటుంబ జీవన శైలి పిల్లలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావానికి కారణమవుతోంది.
చిన్నతనంనుంచి పిల్లలకు తల్లి, దండ్రులు నైతికవిలువలు, సక్రమమైన జీవన శైలి, ఏది తప్పో ఏది ఒప్పో అనే అంశాలను ఎప్పటికప్పుడు తెలియజెపుతూ పెంచితే ఇది కచ్చితంగా వారి జీవ నశైలిని క్రమశిక్షణాయుతంగా మారుస్తుంది. ఎందుకంటే పిల్లలు వెన్నముద్ద వంటివారు, తమ చుట్టుపక్కల జరిగే అంశాలనుంచి అనుక్షణం నేర్చుకుంటుంటారు. వీటిలో మంచి, చెడులు రెండూ వుంటాయి. కానీ చెడు ప్రభావమే అధికం. దీన్నుంచి పిల్లల్ని దూరం చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ఇందుకు తల్లిదండ్రులు తమను తాము క్రమశిక్షణగా మలచుకోకపోతే, తమ అలవాట్లనే పిల్లలు కూడా నేర్చుకుంటారు. ఉదాహరణకు సిగరెట్‌ తాగే అలవాటున్న తండ్రి, తన పిల్లవాడు కూడా ధూమపానం చేస్తే తప్పు అని హెచ్చరించగలడా? ఒకవేళ చెప్పినా ఆ పిల్లవాడు వింటాడా? పెద్దలు ఆదర్శ జీవనం గడుపుతున్నప్పటికీ, పిల్లలు తమ స్నేహితుల ప్రభావంతో చెడు మార్గాలు తొక్కే అవకాశాలు మెండుగా వున్న ఈ కాలంలో, పెద్దలే సక్రమంగా లేకపోతే త ర్వాతి తరం ఉత్తమంగా తయారు కావడం కష్టం.
స్కూల్‌కు వెళ్లే పిల్లల చేతిలో పుస్తకాలు, పెన్నులు, కంపాక్స్‌ వంటివి వుండాలి. కానీ నేడు వీటికి బదులు వారివద్ద స్మార్ట్‌ఫోన్‌లు, ఐపాడ్‌ల వంటివి వుంటున్నాయి. పిల్లలకు పాకెట్‌మనీ కింద విచ్చలవిడిగా డబ్బులు ఇవ్వడం, వారు ఏది కోరుకుంటే అది అందుబాటులోకి తేవడం వంటివి తమ సంతానంపై చూపే ప్రేమకు సంకేతాలు కావు! పిల్లలు ఏది కోరుకుంటే అదివ్వడం కాకుండావారికి ఏది అవసరమో అదివ్వడం తల్లిదండ్రుల నిజమైన ప్రేమ అనిపించుకుంటుంది! రోజులో ఎంతో కొంత సమయం పిల్లలతో గడపడం, వారికి చదువులో సహాయపడటం వారికి నైతిక విలువలు, క్రమశిక్షణాయుత జీవనశైలిపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించడం ఉత్తమ పేరెం టింగ్‌ అనిపించుకుంటుంది. ప్రతి విషయంలో నియంత్రణ పేరుతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం, వారికి తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశమివ్వకపోవడం, వారు చెప్పే ప్రతి విషయాన్ని తేలిగ్గా కొట్టిపారేయడం వంటివి, పిల్లల్లో నెగెటివ్‌ భావనలకు దారితీస్తాయి. ఈ పరిస్థి తుల్లో తమకు తల్లిదండ్రుల మద్దతు లేదన్న భావనకు వచ్చిన పిల్లలు స్నేహితుల ప్రభావంలో పడిపోతారు. ఆ స్నేహితులు కూడా తమలాంటి వారే కనుక, విపరీత ఆకర్షణ కలిగిన చెడుకు క్ర మంగా బానిసలవుతారు.
ప్రస్తుతం రెండు రకాల తల్లిదండ్రులను ఈ సమాజంలో మనం చూడవచ్చు. తమ పిల్లలను అ నుక్షణం నీడలా వెంటాడుతూ, అన్ని నిర్ణయాలు తామే తీసుకుంటూ, వారిలో నిర్ణయసామర్థ్యం లేకుండా ప్రతిదానికీ తమపై ఆధారపడేలా చేసేవారు ఒకరకం. దీన్నే ‘అంబరిల్లా పేరెంట్‌షిప్‌’ అంటారు. అటువంటి పిల్లలు ఎదిగిన వయసులో స్వయం నిర్ణయాలు తీసుకోలేక తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటారు. ఇక మరోరకం తల్లిదండ్రులు స్వేచ్ఛ పేరుతో పిల్లలకు క్రెడిట్‌ కార్డులు, పుష్కలంగా పాకెట్‌ మనీ, సైకిళ్లు, బైక్‌లు, స్మార్ట్‌ ఫోన్‌లు, ఐపాడ్‌లు అందుబాటులోకి తేవడం వల్ల వారికి అదే జీవనశైలికి అలవాటుపడి, ఏమాత్రం సర్దుబాటులేని ధోరణితో, విపరీత మనస్త త్వంతో ప్రవర్తించేవారుగా తయారవుతారు. ఈ రెండు రకాల పేరెంటింగ్‌ ప్రమాదకరమే. పిల్ల లు జీవితంలో ఎదిగేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించేదిగా పెంపంకం వుం డాలి తప్ప అతి ఎక్కడా పనికిరాదు.
రొటీన్‌ జీవితం ఎవరికైనా బోర్‌ కొడుతుంది. అందులో సందేహం లేదు. ఇందుకు కుటుంబ సభ్యులంతా వారాంతపు సెలవులను తమ ఆనందంకోసం కేటాయించుకోవచ్చు. అటువంటి అవ కాశం లేనివారు తమకు అనుకూలమైన సమయాలను ఇందుకు కేటాయించుకోవచ్చు. అప్పుడు కుటుంబ బంధాలు, ఆప్యాయతలు, పరస్పర అవగాహన పెరుగుతాయి. విచిత్రమేమంటే చాలా మంది తల్లులు స్నేహితులతో సరదాగా షికార్లు, షాపింగ్‌లు, చిట్టీ పార్టీల పేరుతో కాలక్షేపాలకు ప్రాధాన్యతనివ్వడం, ఉద్యోగులైన లేదా వివిధ రంగాల్లో స్థిరపడిన మహిళలను పోల్చుకొని అటువంటి జీవితం తమకు లేదన్న భావనతో ఎప్పుడూ అసంతృప్తి జీవితం గడపడం కూడా పిల్లలపై శ్రద్ధ వహించక పోవడానికి కారణమవుతోంది. మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతి, ధనికవర్గాల్లో మరొకరితో సరిపోల్చుకునే మనస్తత్వం తీవ్రంగా వుంటోంది. ఈ ప్రభావానికి లోనైన తల్లిదం డ్రులు తమ పిల్లలకు ఎప్పటికప్పుడు తమకంటే ఎక్కువ ‘ధనవంతులతో’ లేదా మంచి ర్యాంకు సాధించిన పిల్లలతో పోలుస్తూ ‘నువ్వు కూడా అదేవిధంగా ఎదగాలి’ అని నూరిపోస్తుండటం పిల్లలపై తీవ్రమైన ఒత్తిడి కలిగిస్తుంది. ఫలితంగా వారు ఇటు చదువు పరంగా, ఇటు కుటుంబంలో వ్యక్తమయ్యే అభిప్రాయాల పరంగా ఒత్తిడికి లోనై తీవ్ర మానసిక సంఘర్షణకు గురవుతారు.
అతిగా పట్టించుకునే తల్లిదండ్రులు లేదా అసలు పట్టించుకోని తల్లిదండ్రుల ప్రభావం ఒకవైపు, ఎల్లప్పుడూ పొంచివుండే చెడుస్నేహాలు మరోవైపు పిల్లలను సక్రమమైన మానసిక పరిణితివైపు ఎదగనివ్వవు. ఈ రెండూ వారి ప్రగతికి నిరోధకాలే. చేతిలో ఎప్పుడూ స్మార్ట్‌ఫోన్‌, ఐప్యాడ్లు వుండే పిల్లలకు స్కూల్లో పాఠాలు పట్టవు. ఇది వారి అభివృద్ధికి మరో పెద్ద అడ్డంకి. ఇన్ని సందిగ్ధాల మధ్య సంఘర్షణలో ఉన్న పిల్లలకు, సమాజంలో దుర్వ్యసనాలను అలవాటు చేసే ముఠాలు ఇట్టే ఆకర్షించడానికి ముందుంటాయి.
నేటికాలంలో పిల్లలు పబ్బులు, డ్రగ్స్‌ వంటి దుర్వ్యసనాలకు కారణాలు చెప్పుకుంటూ పోవాలంటేసంక్లిష్ట మయమైన సామాజిక పోకడలు అనేకం. తమ పిల్లలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించలేని తల్లిదండ్రులు తీరా నిండా మునిగాక పోలీసులను ఆశ్రయించడం జరుగుతోంది. దుర్వ్యసనాలకు సంబంధించిన వ్యాపారాలన్నింటికి ముఖ్యమైన కస్టమర్లు టీనేజర్లు, యువతే! తల్లిదండ్రులు మితిమీరిన ప్రేమతో ఇచ్చే డబ్బులను ఈ దుర్వ్యసనాలకే ఖర్చుచేస్తారు. మరోమాటలో చెప్పాలంటే అటువంటి ముఠాలు ప్రధానంగా దృష్టి కేంద్రీకరించేది ఇటువంటివారిపైనే! తమ పిల్లల విష యంలో సరైన బాధ్యతగా వ్యవహరించని తల్లిదండ్రులు పోలీసులను, ప్రభుత్వాన్ని నిందించడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. అసలు మీ పిల్లలకు స్నేహితులు ఎవరు? వారి అలవాట్లు ఏవిధంగా వున్నాయి? చెడు అలవాట్లకు బానిసైన వారున్నారా? ఇటువంటి అంశాలపై ఎప్పటిక ప్పుడు తల్లిదండ్రులు దృష్టిపెట్టి మొగ్గ దశలోనే అరికట్టకపోతే తర్వాత చాలా కష్టం!
తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన తల్లిదండ్రులు, తమ పిల్లలకు సరైన న్యాయం చేయలేకపోతున్నామన్న భావనతో వారికి స్వేచ్ఛనిస్తారు. ఎక్కువ ఆదాయవర్గాలకు చెందినవారు కోరిందల్లా ఇచ్చి పిల్లకు స్వేచ్ఛనిస్తారు. ఈ రెండు కేసుల్లో ‘స్వేచ్ఛ’ అనేది కామన్‌! పిల్లలు బలిపశువులు కావడానికి ఈ ‘స్వేచ్ఛ’నే కారణం! ఇక్కడ గుర్తించాల్సిందేమంటే ఏదీ అతి పనికిరాదు! కేవలం ఈ కారణంగానే, పిల్లలు దురలవాట్లకు లోనవుతున్నారు. అంతేకాదు తమ దురలవాట్ల కారణంగా ఏదైనా సమస్యలో చిక్కుకున్నప్పుడు వారు స్నేహితులనే ఆశ్రయించడం మరో విచిత్రం! దీనికి కారణమేంటో తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారా? ఇందుకు రెండు కారణాలు. చెడు అలవాట్లు చేసింది స్నేహితులు కనుక వారికి బయటపడే మార్గాలు తెలుస్తాయనేది మొదటి కారణం. ఈ సమస్యపరిష్కారం తల్లిదండ్రుల వల్ల కాదనో లేక వారికి తెలిస్తే మరింత గొడవ అవుతుందన్న భయం రెండో కారణం. పిల్లలు ఆ స్థాయికి దిగజారడానికి ప్రధాకారణం ఎవరని ప్రశ్నిస్తే, తల్లిదండ్రు లవైపే వేళ్లు చూపుతాయి.
కొన్ని సమయాల్లో పోలీసులదాకా సమస్య వెళ్లిందంటే, ఇందులో తల్లిదండ్రులు తమ బాధ్యతే అధికం! తప్పు తమమీద పెట్టుకొని పోలీసులను, ప్రభుత్వాన్ని నిందించడం వల్ల ప్రయోజనం లేదు. సంసారాన్ని సక్రమంగా నిర్వహించలేని సంపాదన, సరదాలు, షికార్లు, చిట్టీ పార్టీలు ఎందుకు? సంపాదనతో పాటు, సంసారాన్ని బ్యాలన్స్‌ చేసుకుంటూ ముందుకు సాగడమే జీవితం! ఇక్కడ హక్కులు, అహంకారం పనికిరావు! అహం అడ్డొస్తే అట్టడుగుకు పోయేది మీ సంసారమే! ఈ సత్యాన్ని గుర్తించనప్పుడు ఎంత సంపాదించినా వ్యర్థమే! పిల్లలు సక్రమంగా పెరగాలంటే తల్లి దండ్రులు ముఖ్యంగా తాము నేర్చుకొని పిల్లలకు నేర్పాల్సిన ముఖ్యమైన అంశం ఒకటుంది. గొ ప్ప లక్ష్యాలు పెట్టుకోవడం తప్పుకాదు కానీ, వాటిని సాధించలేనప్పుడు జీవితం మనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పరిణితో సంతృప్తిగా జీవించాలన్న సత్యం పెద్దలకు, పిల్లలకు వర్తిస్తుంది. ఇది తెలుసుకోకుండా ఇతరులతో పోల్చుకొని ముందుకెళ్లాలంటే, నిండా మునగ డం ఖాయం! ఎందుకంటే అందరి జీవితాలు ఒకేలా వుండవు! ఎంబాధ్యతలేని తల్లిదండ్రులే పిల్లలకు శాపం
పిల్లలను ఎల్లవేళలా కనిపెట్టుకొని వుండాలి
మితిమీరిన ఆంక్షలు, అతిస్వేచ్ఛ రెండూ పనికిరావు
పిల్లల అభిప్రాయాలకు విలువ ఇవ్వండి
సక్రమంగా జీవించడం నేర్పండి…ప్రతివిషయంలో కలుగజేసుకోవద్దు
అంబరిల్లా పేరెంట్‌షిప్‌ పనికిరాదు
ప్రేమ పేరుతో క్రెడిట్‌కార్డులు, పాకెట్‌ మనీ విచ్చలవిడిగా ఇవ్వొద్దు
ఏది అవసరమో అది ఇవ్వండి…కోరుకున్న ప్రతిదాన్ని ఇవ్వక్కరలేదు
చెడు అలవాట్ల బారిన పడకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి
తప్పు మీపై వుంచుకొని పోలీసులను, ప్రభుత్వాన్ని నిందించి లాభంలేదు
ఎవరి జీవితం వారిదే…ఒకరితో పోల్చుకోవద్దు
జీవితం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి
హైదరాబాద్‌,నేటిధాత్రి:
స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లే తమ పిల్లలు వారాంతాలు లేదా ఖాళీ సమయాల్లో ఎక్కడి వెళుతున్నా రు? ఏం చేస్తున్నారు? వారి ప్రవర్తనాశైలి ఎట్లా వుంటున్నది? మొదలైన అంశాలను నేటికాలపు తల్లిదండ్రుల్లో చాలమంది పట్టించుకోవడంలేదన్నది మాత్రం అక్షరసత్యం. తండ్రి సంపాదనపై, తల్లి చిట్టీపార్టీలు ఇతర వ్యాపకాలపై దృష్టి కేంద్రీకరించి, పిల్లల్ని స్కూల్‌కి లేదా కళాశాలకు పంపడంతో తమ బాధ్యత తీరిందనుకునే మనస్తత్వాల వల్ల బాధ్యతాయుతమైన కింది తరం ఎట్లా తయారవుతుంది? తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగస్తులైతే వారి సంతానం కూడా వారిలాగానే యాంత్రికంగా మారిపోతారు. పొద్దున్నే లేవడం, స్కూల్‌కో కాలేజీకో వెళ్లడం రావడం వంటి రొటీన్‌ కార్యక్రమంతో వాళ్ల దినచర్యలు సాగుతుంటాయి. మిగతా వృత్తుల్లో వున్న తల్లిదండ్రులు కూడా క్షణం తీరికలేని జీవితాలు గడుపుతుండటంతో తమ సంతానం పట్ల శ్రద్ధవహించే సమ యం కూడా వారికుండటంలేదు. ఇటువంటి కుటుంబ జీవన శైలి పిల్లలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావానికి కారణమవుతోంది.
చిన్నతనంనుంచి పిల్లలకు తల్లి, దండ్రులు నైతికవిలువలు, సక్రమమైన జీవన శైలి, ఏది తప్పో ఏది ఒప్పో అనే అంశాలను ఎప్పటికప్పుడు తెలియజెపుతూ పెంచితే ఇది కచ్చితంగా వారి జీవ నశైలిని క్రమశిక్షణాయుతంగా మారుస్తుంది. ఎందుకంటే పిల్లలు వెన్నముద్ద వంటివారు, తమ చుట్టుపక్కల జరిగే అంశాలనుంచి అనుక్షణం నేర్చుకుంటుంటారు. వీటిలో మంచి, చెడులు రెండూ వుంటాయి. కానీ చెడు ప్రభావమే అధికం. దీన్నుంచి పిల్లల్ని దూరం చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ఇందుకు తల్లిదండ్రులు తమను తాము క్రమశిక్షణగా మలచుకోకపోతే, తమ అలవాట్లనే పిల్లలు కూడా నేర్చుకుంటారు. ఉదాహరణకు సిగరెట్‌ తాగే అలవాటున్న తండ్రి, తన పిల్లవాడు కూడా ధూమపానం చేస్తే తప్పు అని హెచ్చరించగలడా? ఒకవేళ చెప్పినా ఆ పిల్లవాడు వింటాడా? పెద్దలు ఆదర్శ జీవనం గడుపుతున్నప్పటికీ, పిల్లలు తమ స్నేహితుల ప్రభావంతో చెడు మార్గాలు తొక్కే అవకాశాలు మెండుగా వున్న ఈ కాలంలో, పెద్దలే సక్రమంగా లేకపోతే త ర్వాతి తరం ఉత్తమంగా తయారు కావడం కష్టం.
స్కూల్‌కు వెళ్లే పిల్లల చేతిలో పుస్తకాలు, పెన్నులు, కంపాక్స్‌ వంటివి వుండాలి. కానీ నేడు వీటికి బదులు వారివద్ద స్మార్ట్‌ఫోన్‌లు, ఐపాడ్‌ల వంటివి వుంటున్నాయి. పిల్లలకు పాకెట్‌మనీ కింద విచ్చలవిడిగా డబ్బులు ఇవ్వడం, వారు ఏది కోరుకుంటే అది అందుబాటులోకి తేవడం వంటివి తమ సంతానంపై చూపే ప్రేమకు సంకేతాలు కావు! పిల్లలు ఏది కోరుకుంటే అదివ్వడం కాకుండావారికి ఏది అవసరమో అదివ్వడం తల్లిదండ్రుల నిజమైన ప్రేమ అనిపించుకుంటుంది! రోజులో ఎంతో కొంత సమయం పిల్లలతో గడపడం, వారికి చదువులో సహాయపడటం వారికి నైతిక విలువలు, క్రమశిక్షణాయుత జీవనశైలిపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించడం ఉత్తమ పేరెం టింగ్‌ అనిపించుకుంటుంది. ప్రతి విషయంలో నియంత్రణ పేరుతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం, వారికి తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశమివ్వకపోవడం, వారు చెప్పే ప్రతి విషయాన్ని తేలిగ్గా కొట్టిపారేయడం వంటివి, పిల్లల్లో నెగెటివ్‌ భావనలకు దారితీస్తాయి. ఈ పరిస్థి తుల్లో తమకు తల్లిదండ్రుల మద్దతు లేదన్న భావనకు వచ్చిన పిల్లలు స్నేహితుల ప్రభావంలో పడిపోతారు. ఆ స్నేహితులు కూడా తమలాంటి వారే కనుక, విపరీత ఆకర్షణ కలిగిన చెడుకు క్ర మంగా బానిసలవుతారు.
ప్రస్తుతం రెండు రకాల తల్లిదండ్రులను ఈ సమాజంలో మనం చూడవచ్చు. తమ పిల్లలను అ నుక్షణం నీడలా వెంటాడుతూ, అన్ని నిర్ణయాలు తామే తీసుకుంటూ, వారిలో నిర్ణయసామర్థ్యం లేకుండా ప్రతిదానికీ తమపై ఆధారపడేలా చేసేవారు ఒకరకం. దీన్నే ‘అంబరిల్లా పేరెంట్‌షిప్‌’ అంటారు. అటువంటి పిల్లలు ఎదిగిన వయసులో స్వయం నిర్ణయాలు తీసుకోలేక తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటారు. ఇక మరోరకం తల్లిదండ్రులు స్వేచ్ఛ పేరుతో పిల్లలకు క్రెడిట్‌ కార్డులు, పుష్కలంగా పాకెట్‌ మనీ, సైకిళ్లు, బైక్‌లు, స్మార్ట్‌ ఫోన్‌లు, ఐపాడ్‌లు అందుబాటులోకి తేవడం వల్ల వారికి అదే జీవనశైలికి అలవాటుపడి, ఏమాత్రం సర్దుబాటులేని ధోరణితో, విపరీత మనస్త త్వంతో ప్రవర్తించేవారుగా తయారవుతారు. ఈ రెండు రకాల పేరెంటింగ్‌ ప్రమాదకరమే. పిల్ల లు జీవితంలో ఎదిగేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించేదిగా పెంపంకం వుం డాలి తప్ప అతి ఎక్కడా పనికిరాదు.
రొటీన్‌ జీవితం ఎవరికైనా బోర్‌ కొడుతుంది. అందులో సందేహం లేదు. ఇందుకు కుటుంబ సభ్యులంతా వారాంతపు సెలవులను తమ ఆనందంకోసం కేటాయించుకోవచ్చు. అటువంటి అవ కాశం లేనివారు తమకు అనుకూలమైన సమయాలను ఇందుకు కేటాయించుకోవచ్చు. అప్పుడు కుటుంబ బంధాలు, ఆప్యాయతలు, పరస్పర అవగాహన పెరుగుతాయి. విచిత్రమేమంటే చాలా మంది తల్లులు స్నేహితులతో సరదాగా షికార్లు, షాపింగ్‌లు, చిట్టీ పార్టీల పేరుతో కాలక్షేపాలకు ప్రాధాన్యతనివ్వడం, ఉద్యోగులైన లేదా వివిధ రంగాల్లో స్థిరపడిన మహిళలను పోల్చుకొని అటువంటి జీవితం తమకు లేదన్న భావనతో ఎప్పుడూ అసంతృప్తి జీవితం గడపడం కూడా పిల్లలపై శ్రద్ధ వహించక పోవడానికి కారణమవుతోంది. మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతి, ధనికవర్గాల్లో మరొకరితో సరిపోల్చుకునే మనస్తత్వం తీవ్రంగా వుంటోంది. ఈ ప్రభావానికి లోనైన తల్లిదం డ్రులు తమ పిల్లలకు ఎప్పటికప్పుడు తమకంటే ఎక్కువ ‘ధనవంతులతో’ లేదా మంచి ర్యాంకు సాధించిన పిల్లలతో పోలుస్తూ ‘నువ్వు కూడా అదేవిధంగా ఎదగాలి’ అని నూరిపోస్తుండటం పిల్లలపై తీవ్రమైన ఒత్తిడి కలిగిస్తుంది. ఫలితంగా వారు ఇటు చదువు పరంగా, ఇటు కుటుంబంలో వ్యక్తమయ్యే అభిప్రాయాల పరంగా ఒత్తిడికి లోనై తీవ్ర మానసిక సంఘర్షణకు గురవుతారు.
అతిగా పట్టించుకునే తల్లిదండ్రులు లేదా అసలు పట్టించుకోని తల్లిదండ్రుల ప్రభావం ఒకవైపు, ఎల్లప్పుడూ పొంచివుండే చెడుస్నేహాలు మరోవైపు పిల్లలను సక్రమమైన మానసిక పరిణితివైపు ఎదగనివ్వవు. ఈ రెండూ వారి ప్రగతికి నిరోధకాలే. చేతిలో ఎప్పుడూ స్మార్ట్‌ఫోన్‌, ఐప్యాడ్లు వుండే పిల్లలకు స్కూల్లో పాఠాలు పట్టవు. ఇది వారి అభివృద్ధికి మరో పెద్ద అడ్డంకి. ఇన్ని సందిగ్ధాల మధ్య సంఘర్షణలో ఉన్న పిల్లలకు, సమాజంలో దుర్వ్యసనాలను అలవాటు చేసే ముఠాలు ఇట్టే ఆకర్షించడానికి ముందుంటాయి.
నేటికాలంలో పిల్లలు పబ్బులు, డ్రగ్స్‌ వంటి దుర్వ్యసనాలకు కారణాలు చెప్పుకుంటూ పోవాలంటేసంక్లిష్ట మయమైన సామాజిక పోకడలు అనేకం. తమ పిల్లలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించలేని తల్లిదండ్రులు తీరా నిండా మునిగాక పోలీసులను ఆశ్రయించడం జరుగుతోంది. దుర్వ్యసనాలకు సంబంధించిన వ్యాపారాలన్నింటికి ముఖ్యమైన కస్టమర్లు టీనేజర్లు, యువతే! తల్లిదండ్రులు మితిమీరిన ప్రేమతో ఇచ్చే డబ్బులను ఈ దుర్వ్యసనాలకే ఖర్చుచేస్తారు. మరోమాటలో చెప్పాలంటే అటువంటి ముఠాలు ప్రధానంగా దృష్టి కేంద్రీకరించేది ఇటువంటివారిపైనే! తమ పిల్లల విష యంలో సరైన బాధ్యతగా వ్యవహరించని తల్లిదండ్రులు పోలీసులను, ప్రభుత్వాన్ని నిందించడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. అసలు మీ పిల్లలకు స్నేహితులు ఎవరు? వారి అలవాట్లు ఏవిధంగా వున్నాయి? చెడు అలవాట్లకు బానిసైన వారున్నారా? ఇటువంటి అంశాలపై ఎప్పటిక ప్పుడు తల్లిదండ్రులు దృష్టిపెట్టి మొగ్గ దశలోనే అరికట్టకపోతే తర్వాత చాలా కష్టం!
తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన తల్లిదండ్రులు, తమ పిల్లలకు సరైన న్యాయం చేయలేకపోతున్నామన్న భావనతో వారికి స్వేచ్ఛనిస్తారు. ఎక్కువ ఆదాయవర్గాలకు చెందినవారు కోరిందల్లా ఇచ్చి పిల్లకు స్వేచ్ఛనిస్తారు. ఈ రెండు కేసుల్లో ‘స్వేచ్ఛ’ అనేది కామన్‌! పిల్లలు బలిపశువులు కావడానికి ఈ ‘స్వేచ్ఛ’నే కారణం! ఇక్కడ గుర్తించాల్సిందేమంటే ఏదీ అతి పనికిరాదు! కేవలం ఈ కారణంగానే, పిల్లలు దురలవాట్లకు లోనవుతున్నారు. అంతేకాదు తమ దురలవాట్ల కారణంగా ఏదైనా సమస్యలో చిక్కుకున్నప్పుడు వారు స్నేహితులనే ఆశ్రయించడం మరో విచిత్రం! దీనికి కారణమేంటో తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారా? ఇందుకు రెండు కారణాలు. చెడు అలవాట్లు చేసింది స్నేహితులు కనుక వారికి బయటపడే మార్గాలు తెలుస్తాయనేది మొదటి కారణం. ఈ సమస్యపరిష్కారం తల్లిదండ్రుల వల్ల కాదనో లేక వారికి తెలిస్తే మరింత గొడవ అవుతుందన్న భయం రెండో కారణం. పిల్లలు ఆ స్థాయికి దిగజారడానికి ప్రధాకారణం ఎవరని ప్రశ్నిస్తే, తల్లిదండ్రు లవైపే వేళ్లు చూపుతాయి.
కొన్ని సమయాల్లో పోలీసులదాకా సమస్య వెళ్లిందంటే, ఇందులో తల్లిదండ్రులు తమ బాధ్యతే అధికం! తప్పు తమమీద పెట్టుకొని పోలీసులను, ప్రభుత్వాన్ని నిందించడం వల్ల ప్రయోజనం లేదు. సంసారాన్ని సక్రమంగా నిర్వహించలేని సంపాదన, సరదాలు, షికార్లు, చిట్టీ పార్టీలు ఎందుకు? సంపాదనతో పాటు, సంసారాన్ని బ్యాలన్స్‌ చేసుకుంటూ ముందుకు సాగడమే జీవితం! ఇక్కడ హక్కులు, అహంకారం పనికిరావు! అహం అడ్డొస్తే అట్టడుగుకు పోయేది మీ సంసారమే! ఈ సత్యాన్ని గుర్తించనప్పుడు ఎంత సంపాదించినా వ్యర్థమే! పిల్లలు సక్రమంగా పెరగాలంటే తల్లి దండ్రులు ముఖ్యంగా తాము నేర్చుకొని పిల్లలకు నేర్పాల్సిన ముఖ్యమైన అంశం ఒకటుంది. గొ ప్ప లక్ష్యాలు పెట్టుకోవడం తప్పుకాదు కానీ, వాటిని సాధించలేనప్పుడు జీవితం మనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పరిణితో సంతృప్తిగా జీవించాలన్న సత్యం పెద్దలకు, పిల్లలకు వర్తిస్తుంది. ఇది తెలుసుకోకుండా ఇతరులతో పోల్చుకొని ముందుకెళ్లాలంటే, నిండా మునగ డం ఖాయం! ఎందుకంటే అందరి జీవితాలు ఒకేలా వుండవు! ఎందుకంటే అందరి టాలెంట్‌ ఒ కేవిధంగా వుండదు. అందువల్ల తల్లిదండ్రులు తమ పిల్లల టాలెంట్‌ను గుర్తించి, అందుకు అ నుగుణంగా వారిని తీర్చిదిద్దాలి. గొంతెమ్మ కోర్కెలతో వారిపై ఒత్తిడి తీసుకొస్తే, వాళ్లు అడ్డదారు లు వెతుక్కుంటారు. ఇది లేనిపోని అనర్థాలకు కారణం. ఎవరి జీవిత గమనం వారికి ఒక తో వంటూ చూపుతుంది. ఇందుకు అడ్డదారులేవీ వుండవు. అది తెలుసుకోకుండా షార్ట్‌కట్‌లు వెతుక్కుంటే ఇక్కట్లే స్వాగతం పలుకుతాయి!

దువుండవు. అది తెలుసుకోకుండా షార్ట్‌కట్‌లు వెతుక్కుంటే ఇక్కట్లే స్వాగతం పలుకుతాయికంటే అందరి టాలెంట్‌ ఒ కేవిధంగా వుండదు. అందువల్ల తల్లిదండ్రులు తమ పిల్లల టాలెంట్‌ను గుర్తించి, అందుకు అ నుగుణంగా వారిని తీర్చిదిద్దాలి. గొంతెమ్మ కోర్కెలతో వారిపై ఒత్తిడి తీసుకొస్తే, వాళ్లు అడ్డదారు లు వెతుక్కుంటారు. ఇది లేనిపోని అనర్థాలకు కారణం . ఎవరి జీవిత గమనం వారికి ఒక తో వంటూ చూపుతుంది. ఇందుకు అడ్డదారులేవీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!