పరకాల బాలుర ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు
పరకాల నేటిధాత్రి
వరంగల్ రీజియన్లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లోని 6,7,8,9 తరగతుల్లోని బ్యాక్లాగ్ సీట్ల కోసం ఈనెల 23 వరకు దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా పరకాల బాలుర గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.2024-25 విద్యా సంవత్సరానికి గాను కాలేజ్ ఆఫ్ ఎక్స్టెన్స్లో 8,9 తరగతుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 23 లోగా దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా అయన కోరారు.ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 21వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుందని వెంకటేశ్వర్లు తెలిపారు. www.tswreis.ac.in వెబ్ సైట్ ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ఆయన కోరారు.