వరంగల్ “ఎస్ఆర్ నగర్లో” ఆక్రమణలపై విచారణ చేయండి

వరంగల్ జిల్లా కలెక్టర్ కు స్థానిక యువకులు పిర్యాదు

గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ ఎస్ఆర్ నగర్లో కొనసాగుతున్న ఖబ్జాల పర్వం అంటూ సోషల్ మీడియాలో మెసేజ్ వైరల్

అంగన్వాడికి సంబంధించిన స్థలంలో అక్రమ నిర్మాణం చేస్తున్నట్లు గురువారం కలెక్టర్ కు పిర్యాదు

స్థానిక అధికార, ప్రతిపక్ష నాయకులు ఒక్కటయ్యారా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు?

వర్దన్నపేట ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలని, కబ్జాలను ఆపాలని వేడుకుంటున్న కాలనీ వాసులు

స్పందించిన రెవెన్యూ అధికారులు, కట్టడాలు ఆపాలని ఆదేశాలు

రెవెన్యూ సిబ్బంది వెళ్లినాక, రాత్రికి రాత్రి పనులు పూర్తి చేసిన వైనం

కాశిబుగ్గ, నేటిధాత్రి

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్ ఎస్సార్ నగర్ లో కొందరు స్థానిక నాయకులు అంగన్వాడి కొరకు కేటాయించిన స్థలంలో అక్రమ కట్టడాలు చేస్తున్నారని గురువారం వరంగల్ జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేశారు కాలనీ యువకులు. గత కొన్ని రోజులుగా వరంగల్ ఎస్ఆర్ నగర్లో కొనసాగుతున్న ఖబ్జాల పర్వం అని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ కావడంతో స్పందించిన వరంగల్ రెవెన్యూ అధికారులు, ఏనుమాముల పోలీసుల సమక్షంలో అక్రమ కట్టడాలపై విచారణ జరిపినట్లు సమాచారం. ఎస్సార్ నగర్ లో అంగన్వాడి కి సంబంధించిన స్థలంలో స్థానిక నాయకులు అక్రమ కట్టడం చేస్తున్నారు అని సోషల్ మీడియాలోనూ, జిల్లా కలెక్టర్ కి లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు కొందరు యువకులు. కాలనికి సంబంధించిన ప్రభుత్వ స్థలాల్లో అంగన్వాడి కేంద్రం, గుడికి సంబంధించిన స్థలాలను స్థానిక నాయకులు కొందరు పేద ప్రజల పేరుతో కబ్జా చేస్తున్నారు అని వారి ఆరోపణ. అన్ని పార్టీలు ఏకమై ఖాళీ స్థలాలను కబ్జా చేస్తున్నారా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్థానిక నాయకులను ఫోన్ ద్వారా వివరణ కోరగా ఈ స్థలాలు పేద ప్రజలకు సంబంధించినవి అని, గతంలో డబల్ బెడ్రూంలు రాని వారికి, ఈ ఖాళీ స్థలంలో కాలనీ పెద్దమనుషుల అందరం కలిసి కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. కొందరు కావాలని మా మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని స్థానిక నాయకుల వివరణ. ఏది ఏమైనా కానీ ఈ అక్రమ కట్టడాల వెనుక అసలు కథ తెలియాలి అంటే రెవెన్యూ అధికారుల రిపోర్ట్ కోసం వేచి చూడాల్సిందే. ఈ స్థలం పేద ప్రజలకు చెందినదేనా? ప్రభుత్వ స్థలమా అని నిర్ధారించవలసిన అవసరం అధికారులకు ఉంది. గతంలో గుడి స్థలంలో కేతిరి రాజశేఖర్ నిర్మాణం చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. అక్రమ కబ్జాల వెనుక డబ్బులు చేతులు మారినట్లు తెలుస్తోంది? ఎవరికీ వారు దొరికినాకాడికి దోచుకుంటున్న వైనం? అంగన్వాడికి సంబంధించిన స్థలం ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు యువకులు? పిర్యాదు చేసిన వారినే పోలీసులు బెదిరిస్తున్న పరిస్థితి ఉంది అని వాపోతున్నారు కొందరు స్థానిక యువకులు. విచారణ జరిపి రెవెన్యూ అధికారులు చెప్తే కానీ అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!