జ్యోతిరావు పూలే, రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
శాయంపేట నేటి ధాత్రి:
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుల గణన చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిన్న జరిగిన అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం ప్రవేశపెట్టడాన్ని హర్షిస్తూ కాంగ్రెస్ బీసీ సెల్ మండల అధ్యక్షుడు లడే రాజ్ కుమార్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జ్యోతిరావు పూలే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జనాభా ప్రతిపదకన సమగ్ర కులగనన చేయడం కోసం అసెంబ్లీలో బిల్లు పెట్టడం హర్షనీయ మన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పినట్టు ఎంత జనాభా ఉంటే అంత వాటా ఉండాలని ఆయన ప్రతిపాదనలకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేయడం చారిత్రాత్మక నిర్ణయం అన్నారు గత పది సంవత్సరాలుగా బీసీల గురించి పట్టించుకోని ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు చట్టం తేవాలని మాట్లాడడం దురదృష్టకరమన్నారు ముఖ్యంగా బీసీలు రాజకీయంగా సామాజికంగా ఎదగడానికి ఈ కుల గణన దోహదపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు వైనాల కుమారస్వామి చిందం రవి, తడుక కుమారస్వామి నిమ్మల రమేష్ నాగేశ్వరరావు సతీష్ వాల్పదాసు రాము మార్కండేయ వీరన్న చంద్రమౌళి తిరుపతి మోర శ్రీను తదితరులు పాల్గొన్నారు