అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025 అవగాహన సదస్సు పిఎసిఎస్ సేవలపై అవగాహన ర్యాలీ
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025 ను పురస్కరించుకొని
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పిఎసిఎస్ చైర్మన్ కన్నెబోయిన కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో 28-4-25సాయంత్రం 5: 30 ని లకు అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025 లో భాగంగా అవేర్నెస్ వాక్ ద్వారా అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో గుర్రం సురేష్ డైరెక్టర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కట్కూరు శ్రీనివాస్, ఎక్స్ జెడ్పిటిసి ముత్యాల రాజయ్య, వైస్ ఎంపీపీ విడిది నేని అశోక్, మాజీ కో ఆప్షన్ మెంబర్ ఎండి చోట మియా, రైతులు, సభ్యులు ప్రజా ప్రతినిధులు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.