పరకాల నేటిధాత్రి
తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుక నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా టిఈఏ హన్మకొండ జిల్లా అధ్యక్షులు బొట్ల రమేష్ మాట్లాడుతూ మహిళలు రాజకీయాలలో మరియు అన్ని రంగాలలో ముందు ఉండే విధంగా మనకు రాజ్యాంగం కల్పించిందని అంబేద్కర్ మహిళలను చదువుకునే విదంగ,ఇంటి పనులకు పరిమితం కాదని రాజ్యాంగం మనకు స్వెచ్చ హక్కును కల్పించిందని అన్నారు. అనంతరం మహిళలను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి గోవిందు నవీన్ కుమార్,మున్సిపల్ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజారపు భాస్కర్,మున్నంగి రఘు,కృష్ణ స్వామి,ప్రవీనా,భాగ్య,సుమతి, మమత,ఈశ్వరమ్మ,కోమురమ్మ,వనజ,జ్యోతి,సరిత, మరియు మహిళలు,అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.