భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో స్త్రీ పాత్ర గొప్పది,ప్రధానోపాధ్యాయులు చందూరి రాజిరెడ్డి!!!
ఎండపల్లి నేటి ధాత్రి
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ప్రాథమిక పాఠశాల గుల్లకోటలో పనిచేస్తున్న మహిళ ఉపాధ్యాయులను తల్లిదండ్రులను ప్రధానోపాధ్యాయులు చందూరి రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,భారతీయ సంస్కృతి సాంప్రదాయము మహిళల పాత్ర కుటుంబ జీవనము సమన్యాయం కోసం ప్రపంచవ్యాప్తంగా మహిళలు చేసిన పోరాటాలు సమాజ ఉన్నతిలో స్త్రీ పాత్ర సమాన అవకాశాలు మొదలగు అనేక విషయాలను ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాలలో పనిచేస్తున్న మహిళ ఉపాధ్యాయులు ఎస్ రమాదేవి బి శ్రీలత పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గొల్లపెల్లి శిరీష ,ఊడ్పరి ఎల్లవ్వ లను మరియు విద్యార్థుల మాతృమూర్తులను ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎం శ్రీనివాస్ బి నరేష్ కుమార్ కే కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు .