International Women’s Day Significance
అంతర్జాతీయ మహిళా దినోత్సవం
మంచిర్యాల,నేటి ధాత్రి:
మహిళలకు ప్రత్యేకమైన రోజుగా ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు. మహిళల సాధన,కృషి, విజయాలను గుర్తించి,లింగ సమానత్వం,హక్కులను గుర్తిస్తారు.
మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు?
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక థీమ్‌తో జరుపుకుంటారు. 2026కు సంబంధించి మహిళా సాధికారత,సమానత్వం, నాయకత్వంపై దృష్టి సారిస్తూ థీమ్ రెడీ చేశారు.ప్రపంచ వ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి,సమాజంలో సానుకూల మార్పులు తీసుకురావడానికి ఈసారి ప్రత్యేక థీమ్ ‘గీవ్ టూ గైన్,అంటే ఒకరికి ఒకరు సహాయం చేస్తే,అందరికీ ప్రయోజనం కలుగుతుందని,సమాజంలో పురోగతి సాధ్యమవుతుందని ఈ థీమ్ సూచిస్తుంది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం చరిత్ర
అంతర్జాతీయ మహిళా దినోత్సవం మొదట అమెరికాలో 1900లో ప్రారంభమైంది.ఆ కాలంలో మహిళలకు ఎక్కువగా పని గంటలు ఉంటూ జీతం తక్కువగా ఉండేది.ఆ పరిస్థితిని తట్టుకోలేని మహిళలు వారి హక్కుల కోసం తిరుగుబాటు మొదలుపెట్టారు.వారు తగిన వేతనం,పని గంటలు తగ్గించడం, ఓటు హక్కు వంటి అంశాలపై పోరాటాలు చేశారు.1910లో సోషలిస్టు పార్టీ ఆఫ్ అమెరి
