రుద్రంగి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామంలో జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి మాట్లాడుతూ బాలికలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలని తెలియజేశారు .భవిష్యత్ కాలంలో వచ్చే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలని విద్యా, వైద్య ,రక్షణ ,సంరక్షణ విషయంలో తమ హక్కులను తెలుసుకొని అభివృద్ధి సాధించాలని, అలాగే ఏదైనా సమస్య వచ్చినట్లయితే1098 హెల్ప్ లైన్ నెంబర్ ను సంప్రదించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు సిడిపివో సుచరిత , పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ, సూపర్వైజర్ మమత, డి హబ్ కోఆర్డినేటర్ రోజా, సోషల్ వర్కర్ విజయ్, చైల్డ్ లైన్ సిబ్బంది వంశీ, పాఠశాల సిబ్బంది , పిల్లలుతదితరులు పాల్గొనడం జరిగింది.