
నర్సంపేట టౌన్,నేటిధాత్రి :
నర్సంపేట పట్టణంలోని అక్షర ద స్కూల్, బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ లో అంతర్జాతీయ
శాంతి దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ప్రపంచ శాంతి కోరుకుంటూ చిన్నారులు అందరూ తెల్లని దుస్తులు ధరించి శాంతియుతను కోరుతు ఐక్యంగా ఉండాలని కోరారు.పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి గౌడ్ మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లోని ప్రజలంతా శాంతియుత జీవనం గడపాలనే ఉద్దేశంతో ఘర్షణలకు ముగింపు పలకడానికి,శాంతియుత సమాజం ఏర్పాటు దిశగా ముందడుగు వేయడానికి శాంతి దినోత్సవాన్ని ఏర్పాటు చేశారని అమే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి బాలాజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రాజేంద్రప్రసాద్, ట్రెజరర్ డాక్టర్ వనజ,సెక్రటరీ రాజేశ్వర్ రెడ్డి,సిఏఓ సురేష్, ఉపాధ్యాయ, ఉపాధ్యాయ బృదం విద్యార్థులు,తల్లితండ్రులు పాల్గొన్నారు.