*హన్మకొండ జిల్లాలో ఏకశీల కళాశాల యాజమాన్యం వేధింపులు..*
*ఓ వైపు ఫీజులు మరో వైపు ర్యాంక్ లు రావాలంటూ హుకుం జారీ..*
*శ్రీదేవి అనే ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య..*
*తల్లిదండ్రులకు,స్థానిక పోలీసులకు తెలియకుండానే మార్చరీకి తరలించిన యాజమాన్యం…*
*ఏకశిలా యాజమాన్యం పై దుమ్మెత్తిపోస్తున్న తల్లిదండ్రులు..*
*హనుమకొండ , “నేటిధాత్రి”*
హనుమకొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది
హనుమకొండ లోని డబ్బాలు సమీపంలో గర్ల్స్ ఏకశిలా హాస్టల్లో విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో నగరంలో తీవ్ర కలకలం రేపుతుంది
ఏకశిలా గర్ల్స్ క్యాంపస్ లో శ్రీదేవి (16) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది ఏకశిలా గర్ల్స్ హాస్టల్లో శ్రీదేవి ఉంటుంది. అయితే మంగళవారం రాత్రి శ్రీదేవి ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. చాలాసేపటికి గది తలుపులు తెరవకపోవడంతో అక్కడ ఉన్నటువంటి విద్యార్థినిలు ఏకశిలా యాజమాన్యానికి సమాచారం అందించారు. విషయం తెలియగానే ఏకశీల యాజమాన్యం హుటాహుటిన క్యాంపస్ కి వచ్చి రూమ్ తలుపులు తెరవడంతో శ్రీదేవి ఫ్యానుకు ఉరివేసుకొని కనపడింది శ్రీదేవిని క్రిందకి దింపగా అప్పటికే చనిపోయినట్టు నిర్ధారించగ ఏకశిలా యాజమాన్యం శ్రీదేవి యొక్క తల్లిదండ్రులకి సమాచారం అందించకుండానే మృతదేహాన్ని మార్చురికి తరలించడం జరిగింది. కొద్దిసేపటికి శ్రీదేవి కుటుంబ సభ్యులకి సమాచారం అందడంతో వారు క్యాంపస్ కి వచ్చి ఏకశిల యాజమాన్యాన్ని నిలదీయగ దీంతో యాజమాన్యం పొంతన లేని సమాధానం చెప్పగా కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఏకశిలా క్యాంపస్ కి చేరుకోనీ యాజమాన్యాన్ని అడుగగా అనారోగ్య కారణాలవల్లనే శ్రీదేవి చనిపోయి ఉంటుందని ఏకశిల యాజమాన్యం పోలీసులతో చెప్పడం జరిగింది. దీంతో బంధువులు విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున క్యాంపస్ కి చేరుకొని కుటుంబ సభ్యులకు మద్దతుగా నిలిచారు. తమ కూతురు అనారోగ్యంతో ఉంటే ఉరి ఎందుకు వేసుకుంటుందని కావాలనే ఏకశిలా యాజమాన్యం తమ కుమార్తెను బలి తీసుకున్నారని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుమార్తె చనిపోతే తల్లిదండ్రులకు మరియు పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని మార్చురీకి ఎందుకు తీసుకెళ్తారని యాజమాన్యాన్ని బంధువులు ప్రశ్నించడం జరిగింది. దీంతో ఏకశిలా క్యాంపస్ లో ఉద్రిక్తత నెలకొంది విద్యార్థిని తల్లిదండ్రులకి న్యాయం జరిగే వరకూ ఈ పోరాటం ఆగదని బంధువులు మరియు విద్యార్థి సంఘాలు పేర్కొన్నారు దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.