జిల్లా కలెక్టర్
వనపర్తి నేటిదాత్రి;
వనపర్తి జిల్లాలో ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును, పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు కల్పించిన మౌలిక వసతులను పరిశీలించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్ష జరుగుతున్న తీరుపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొత్తం ఎంతమంది విద్యార్థులు హాజరయ్యారు, ఎంతమంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరు అయ్యారని ఇంటర్మీడియట్ నోడల్ అధికారి ని ప్రశ్నించారు. స్పందించిన అధికారి ఈరోజు జిల్లావ్యాప్తంగా జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలకు 6940 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 6627 మంది విద్యార్థులు పరీక్షలు హాజరయ్యారని, 313 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు తెలిపారు.
ఇంటర్మీడియట్ నోడల్ అధికారి సి. మద్దిలేటి కలెక్టర్ వెంట ఉన్నారు.