ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ వార్షిక పరీక్షలు
బాలానగర్ /నేటి ధాత్రి.
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 5వ తేదీ నుండి గురువారం వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. గురువారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు రసాయన శాస్త్రం, వాణిజ్యశాస్త్రం పరీక్షలు జరిగాయి. మొత్తం 443 మంది విద్యార్థులకు గాను.. 4 గైర్హాజరు కాగా.. 439 మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రశాంతంగా పరీక్షలు జరగడంతో విద్యార్థులు కేరింతలు కొడుతూ.. ఆనంద వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.