సైన్స్ తోనే సమగ్ర అభివృద్ధి

– ముగిసిన మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబురాలు

నెక్కొండ, నేటి ధాత్రి:
విద్యార్థులలో పాఠశాల స్థాయి నుంచి సైన్స్ అభ్యసన పట్ల అభిరుచిని పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ,సైన్స్ తోనే దేశ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని జన విజ్ఞాన వేదిక (జెవివి )జిల్లా బాధ్యులు ,చెకుముకి మండల కన్వీనర్ బూరుగుపల్లి శ్రవణ్ కుమార్, నెక్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. రంగారావు లు అన్నారు. నెక్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం చెకుముకి సైన్స్ సంబురాలలో భాగంగా సైన్స్ టాలెంట్ టెస్ట్ ను నిర్వహించారు. మండలంలోని 10 ప్రభుత్వ ప్రైవేటు ,ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులు ,టీచర్లు ఈ పోటీలో పాల్గొన్నారు . జడ్పీహెచ్ఎస్ దీక్షకుంట , నెక్కొండ గౌతమి విద్యా నికేతన్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మండల స్థాయిలో ప్రతిభ చాటి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ప్రభుత్వ పాఠశాలల విభాగంలో దీక్షకుంట ఉన్నత పాఠశాల విద్యార్థులు శ్రవణ్ కుమార్ ,జి విష్ణువర్ధన్ ,ఏ అరుణ్ కుమార్ ప్రథమ స్థానంలో నిలవగా, ప్రైవేటు పాఠశాలల విభాగంలో గౌతమి విద్యానికేతన్ ఉన్నత పాఠశాల విద్యార్థులు బి సహజల్ యోధన్ శాస్త్రి, జే స్వరణ్ కుమార్, కే విశాల్ యాదవ్ లు ప్రథమ స్థానంలో నిలిచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వచ్చే నెల 3న నర్సంపేటలో జిల్లా స్థాయి పోటీలు జరగనున్నట్లు చెకుముకి మండల కన్వీనర్ బూరుగుపల్లి శ్రవణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల స్థాయిలో ప్రతిభ చాటిన 30 మంది విద్యార్థులకు హెచ్ఎం రంగారావు చేతులమీదుగా గైడ్ టీచర్ల సమక్షంలో ప్రశంసా పత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీఆర్పీలు సుమలత ,శ్రీనివాసచారి వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు విశ్వ ప్రసాద్ ,సురేందర్ రెడ్డి, కిషోర్ ,నర్సయ్య, రమేష్, సంపత్ ,మధుసూదన్ ,అరుణ కుమారి ,లక్ష్మీ,రాజు ,రవీందర్, శ్రీనివాస్ ,జోగయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!