
Sonti Reddy Provides Free Insurance to 160 Auto Drivers
ప్రతి డ్రైవర్ కు ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం
మాట నిలబెట్టుకున్న సొంటి రెడ్డి
#నెక్కొండ, నేటి ధాత్రి:
క్కొండ మండల కేంద్రంలోని నవత ఆటో యూనియన్ సభ్యులందరికీ తన సొంత ఖర్చులతో ఉచితంగా ప్రమాద బీమా చేపిస్తానన్న మాట ప్రకారం. 160 మంది డ్రైవర్లకు సంవత్సరం పాటు ఉచితంగా ప్రమాద బీమా ఐదు లక్షల రూపాయల బీమా ఇన్సూరెన్స్ చేపించిన టిపిసిసి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి. బుధవారం మండల కేంద్రంలోని తహసిల్దార్ సెంటర్లో నవత ఆటో యూనియన్ అధ్యక్షుడు మోడెం సురేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఇన్సూరెన్స్ భీమ పత్రాలను నవత ఆటో యూనియన్ డ్రైవర్లకు అందించిన సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, ఈ సందర్భంగా సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి మాట్లాడుతూ ఒక సంవత్సరమే కాకుండా ఐదు సంవత్సరాలు కంటిన్యూగా ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ పాలసీ బీమా అందరికీ చెల్లిస్తానని ఇంకా ఎవరైనా డ్రైవర్లు ఉంటే వాళ్ల పేర్లు కూడా పంపించాలని ప్రతి ఒక్క డ్రైవర్ కు ఇన్సూరెన్స్ చాలా ముఖ్యమని యూనియన్ బాధ్యులకు తెలిపారు. డ్రైవర్ల అందరూ ప్రభుత్వానికి పరోక్షంగా సేవ చేస్తున్నారని, ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుటలో డ్రైవర్ల పాత్ర కీలకమని, వీరి కుటుంబాలు వీరిపై ఆధారపడి ఉన్నాయని, ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే ఎవరో ఏదో సహాయం చేస్తారని ఎదురు చూడకుండా చట్టప్రకారం ఇన్సూరెన్స్ చేసి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని పొందే అవకాశం ప్రభుత్వం కల్పించిందని, ఇలాంటి ఇన్సూరెన్స్ లను వినియోగించుకోవాలని డ్రైవర్లకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి కి చిరు సన్మానం చేశారు .కార్యక్రమంలో నవత ఆటో యూనియన్ అధ్యక్షుడు మోడెం సురేష్, శ్రీరంగం శ్రీనివాస్, ఉల్లేరావు ప్రభాకర్, పెండ్యాల రాజు, బద్రు నాయక్, మోడెం రాజు, మహమ్మద్ అమీర్, నవత ఆటో యూనియన్ డ్రైవర్లు, తదితరులు పాల్గొన్నారు.