Insurance Cheque Handed Over to Bereaved Family
భాధిత కుటుంబానికి బీమా చెక్కు అందజేత
పరకాల,నేటిధాత్రి
పట్టణానికి చెందిన కొలుగూరి సరోజన భర్త కొలుగూరి రాజేశ్వరరావు చిరు వ్యాపారం నిర్వహించుకునేందుకు సుమారు ఆరు నెలల క్రితం బంధన్ బ్యాంక్ పరకాల బ్రాంచ్లో రూ.50 వేల రుణం తీసుకున్నారు.రుణం తీసుకునే సమయంలో ఆయన బీమా సౌకర్యం పొందగా,రూ.లక్ష బీమా చేయించారు.అయితే రెండు నెలల క్రితం రాజేశ్వరరావు మృతి చెందారు.ఈ నేపథ్యంలో బీమా నిబంధనల ప్రకారం బంధన్ బ్యాంక్ ద్వారా రూ.లక్ష బీమా మొత్తానికి సంబంధించిన చెక్కును సోమవారం కొలుగూరి సరోజనకు అందజేశారు.ఈ కార్యక్రమంలో పరకాల బ్రాంచ్ మేనేజర్ బానోతు నరేష్, ఏరియా మేనేజర్ బాధవత్ శ్రీను,ఏజెంట్ మాలోతు అనిల్ పాల్గొన్నారు.బీమా సౌకర్యం ద్వారా కుటుంబానికి ఆర్థిక భరోసా లభించిందని బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు.
