మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాలలో నిర్వహించలనుకున్న దుర్గామాత మండపాల కార్యవర్గ సభ్యులకు, నిర్వహకులకు జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్ ఎలాంటి అవాంఛనీయన సంఘటనలు జరగకుండా పాటించవలసిన నియమ నిబంధనల గురించి తగు సూచనలు జారీ చేశారు.
జిల్లాలో మొత్తం (269) దుర్గామాత విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఇట్టి
దుర్గామాత విగ్రహాలు నిర్వాహకులు సంబంధిత పోలీస్ స్టేషన్ నుంచి తగిన అనుమతి తీసుకోని,ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారి పర్మిషన్ తీసుకుని కరెంటు వాడాలి. దుర్గామాత మండపానీ రోడ్డు పక్కన గాని, ఖాళీ స్థలంలో గాని ఏర్పాటు చేయాలని, విగ్రహం యొక్క స్టేజ్ కింద ఎలాంటి అవాంఛనీయ వస్తువులు ఉంచకుండా, మండపాల వద్ద తగినంత సంఖ్యలో స్థానిక, సత్ప్రవర్తన కలిగిన వాలంటీలను నియమించి భక్తులను క్రమబద్ధీకరించే విధంగా చూడలని అన్నారు. వివాదాస్పద ప్రదేశాలలో మండ పాలు ఏర్పాటు చేయరాదని, ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలిగకుండా, దుర్గామాత మండపాల వద్ద వాలంటీర్లు 24×7 తప్పకుండా కాపలా ఉండాలని సూచించారు. మండపాలలో
ఆసాంఘిక కార్యాకలాపాలకు తావివ్వకూడదని, మంటపాలలో టపాకాయలు మరియు మందు గుండు సామాగ్రిని ఉంచరాదన్నారు. మండపాల దగ్గర పూజా సమయంలో భక్తుల వాహనాలను సరైన పద్ధతిలో పార్కింగ్ చేయుటకు ఏర్పాటు చేయాలని, దుర్గామాత విగ్రహాల కమిటీ మెంబర్ల పేర్లు, సెల్ ఫోన్ నెంబర్లు, సంబంధిత పోలీస్ స్టేషన్లో ఇవ్వాలని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉదయం ఆరు గంటల నుండి రాత్రి 10 గంటల వరకు స్పీకర్లను తగిన సౌండ్ మోతాదులోనే ఉపయోగించాలని, లౌడ్ స్పీకర్లు విద్యాలయాలకు, ఆసుపత్రులకు, ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలకు, ప్రార్థన మందిరాలకు ఇబ్బంది కలిగే విధంగా ఉండకూడదన్నారు. మంటపాల వద్ద నీళ్ల డ్రమ్ములు మరియు ఇసుక తప్పనిసరిగా ఉంచవలెనని, మహిళల పట్ల మర్యాదపూర్వకంగా మెలగాలి. మంటపాల చుట్టూ తగినంత వెలుతురు ఉండేలా చూడాలి. విద్యుత్ కోత సమయంలో తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు విధిగా ఏర్పాటు చేసుకోవాలి. రెచ్చగొట్టే పోస్టర్లు గాని బ్యానర్లు గాని కరపత్రాలు గాని సోషల్ మీడియా మెసేజ్ లలో ప్రచారం చేయరాదు. మంటపాల వద్ద కొత్త వ్యక్తులు సంచరించినచో పోలీస్ వారికి విధిగా తెలియపరచాలి. విగ్రహ ప్రతిష్ట నుండి మొదలుకొని నిమజ్జనం వరకు సంబంధిత ఆర్గనైజర్స్ పూర్తి బాధ్యత వహించవలెను. పెద్దలు నిర్ణయించిన తేదీల లోపల ఎలాంటి అవాచనియ సంఘటనలకు తావివ్వకుండా నిమర్జనం పూర్తి చేయాలి. విగ్రహాలను ఏర్పాటు చేసిన వారు మండపాల వద్ద మరియు పరిసర ప్రాంతాలలో విధిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి. ఎటువంటి చిన్న సమాచారం ఉన్న మీ దగ్గరలోని పోలీస్ వారికి లేదా డయల్ 100 కు తెలపగలరు. ప్రతి దుర్గామాత మండపాల దగ్గర విధిగా పాయింట్ పుస్తకం ఏర్పాటు చేయవలెను. దుర్గామాత విగ్రహాలను జియో ట్యాగింగ్ ద్వారా గూగుల్ మ్యాప్ లకు అనుసంధానం చేయడం జరుగుతుంది. ఇందుకుగాను మంటపాల వద్దకు బ్లూకోల్ట్స్ లేదా పెట్రోలింగ్ పోలీస్ సిబ్బంది వెళ్లి జియో టాకింగ్ చేయడం జరుగుతుంది.
నిర్వాహకులు, ప్రజలు పోలీసు వారి సూచనలు సలహాలు పాటిస్తూ ప్రశాంతంగా ఆనందోత్సవాల మధ్య దుర్గామాత ఉత్సవాలు జరుపు జరుపుకోవాలని, ఎస్పీ సూచించారు.