New Transformer Installed to Fix Power Issues in Narsampet
కరెంట్ సమస్యలు తీర్చేందుకు ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు
మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్
వివేకానంద కాలనీలో కొత్త ట్రాన్స్ఫార్మర్ ప్రారంభం
నర్సంపేట,నేటిధాత్రి:
10 వ వార్డులో ఉన్న కరెంట్ సమస్యలను తీర్చడం కోసం నూతనంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామనంద్ అన్నారు.నర్సంపేట పట్టణంలోని 10వ వార్డు వివేకానంద కాలనీలో కొత్త ట్రాన్స్ఫార్మర్ను వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్ తో కలిసి మున్సిపాలిటీ చైర్పర్సన్ పెండెం లక్ష్మీ రామానంద్, వైస్ చైర్మన్ గంధం నరేందర్, ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ, వివేకానంద కాలనీలో విద్యుత్ సరఫరా సమస్యలు తీవ్రంగా ఉండేవని తెలిపారు. ఓవర్లోడ్ కారణంగా జంపర్లు కాలిపోవడం, తరచూ విద్యుత్ అంతరాయం కలగడం వల్ల స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని కాలనీ కొంత ప్రాంతానికి కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.పట్టణంలో ఎక్కడైనా విద్యుత్ సమస్యలు తలెత్తితే తక్షణమే విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని పరిష్కరిస్తున్నామని, ముఖ్యంగా 10వ వార్డులో విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీరామోజు రోజారాణి, విద్యుత్ శాఖ ఏఈ అశోక్, వార్డు సభ్యులు దార గణేష్, అరెపెల్లి బాబు, మహేందర్, మారపెల్లి అశోక్, పాశికంటి రమేష్, లైన్ ఇన్స్పెక్టర్, లైన్మెన్ తదితరులు పాల్గొన్నారు.
