
AIYF Launches Anti-Drug Campaign Inspired by Bhagat Singh
భగత్ సింగ్ స్పూర్తితో డ్రగ్స్, గంజాయి, మాధకద్రవ్యాలకు వ్యతిరేకంగా ఉద్యమిద్దం
ఫార్మా, కెమికల్ పరిశ్రమల పేరిట డ్రగ్స్ దందాకు పాల్పడుతున్న దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి
ఏఐవైఎఫ్ నగర కార్యదర్శి
చెంచాల మురళి
కరీంనగర్, నేటిధాత్రి:
చాప కింద నీరులా ప్రవహిస్తున్న డ్రగ్స్ దందా కోట్ల రూపాయల మాఫియాగా ఎదుగుతుంటే డ్రగ్స్ నిర్మూలన కోసమే ఏర్పడిన ఈగల్, నార్కోటిక్, ఎన్ఫోర్స్మెంట్ వింగ్, ఎలైట్ యాక్షన్ గ్రూప్, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ వంటి సంస్థలు ఏం చేస్తున్నాయని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) నగర కార్యదర్శి చెంచాల మురళి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇటీవల చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో కోట్లు విలువ చేసే డ్రగ్స్, సంబంధిత కెమికల్స్ పట్టుబడటం సిగ్గు చేటు అని, డ్రగ్స్, గంజాయి, మాధక ద్రవ్యాలను నిర్మూలించాలని,రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పరిశ్రమలలో ప్రభుత్వం తక్షణమే విస్తృత తనిఖీలు చేపట్టాలని, డ్రగ్స్ తయారు చేస్తున్న,సరఫరా చేస్తున్న దుర్మార్గులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈసందర్భంగా చెంచల మురళి మాట్లాడుతూ షహీద్ భగత్ సింగ్ సెప్టెంబర్ 28న మన దేశంలో జన్మించారని,దేశ స్వాతంత్య్రం కోసం ఉరికొయ్యలను సైతం లెక్కచేయకుండా, భవిష్యత్తు తరాల కోసం బ్రిటీష్ ముష్కరులను ఎదిరించి వీరోచిత పోరాటాలు చేసి వీరమరణం పొందరన్నారు. కానీ,భగత్ సింగ్ కలలుగన్న స్వరాజ్య ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. విద్యార్థులకు, యువతకు ఆదర్శప్రాయుడైన భగత్ సింగ్ స్పూర్తితో నేటి యువత చెడు మార్గాలను, చెడు అలవాట్లను విడనాడాలని,అందుకే భగత్ సింగ్ 118వ జయంతి సందర్భంగా స్టాప్ డ్రగ్స్ -స్టార్ట్ స్పోర్ట్స్ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు, ఇందులో భాగంగానే ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. అదే విధంగా అతి తక్కువ సమయంలో యువకులను లోబరచుకొని, యువతను నిర్వీర్యం చేసే డ్రగ్స్, గంజాయి ఇతర మత్తు పదార్థాల వలన వ్యక్తులు, కుటుంబాలు తద్వారా సమాజమే సంక్షోభానికి గురవుతుందని, వీటిపట్ల కఠినంగా వ్యవహరించి డ్రగ్స్ నిర్మూలనలో తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిదేనని వారు డిమాండ్ చేశారు. చర్లపల్లిలోని వాగ్దేవి ల్యాబ్ యాజమాన్యాన్ని ప్రధాన నిందితుడు శ్రీనివాస్, విజయ్ ఓలేటి, తానాజి పట్వారీ తదితరులను కఠినంగా శిక్షించాలని తెలిపారు. రాష్ట్రంలో అనుమతి లేని కెమికల్,ఫార్మా ఇతర కంపెనీలపై దృష్టి పెట్టాలని అనుమతి లేని ఫ్యాక్టరీల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలన్నారు. పరిశ్రమల ఏర్పాటు చేసుకోవడానికి అద్దె,లీజుకు ఇస్తున్న యజమానులు బాధ్యతను మరువకుండా ఆయా పరిశ్రమల్లో ఏమి తయారు చేస్తున్నారో ముందుగా పరిశీలించాలన్నారు. తెలంగాణలో రేవంత్ సర్కార్ డ్రగ్స్ ను అరికట్టడంలో చొరవ చూపిస్తున్నా ఆయా శాఖల అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అటువంటి అధికారులను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో కార్తీక్, అభిషేకం, విష్ణువర్ధన్,శశి, అవినాష్, రమేష్, వేణు,రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.