# రూ. 2 వేలు జరిమానా,మెమో జారీ.
# శుభ్రత పాటించకుంటే సీజ్ చేస్తాం
# ఫుడ్ సేఫ్టీ జిల్లా అధికారి కృష్ణమూర్తి
నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి :
దుగ్గొండి మండలంలోని గిర్నిబావి గ్రామం ప్రధాన రహదారిపై ఉన్న శ్రీ గణపతి స్వీట్ హౌస్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు.ఆ స్వీట్ హౌస్ లో నిత్యం పరిశుభ్రత పాటించకపోవడంతో కష్టమర్ల పిర్యాదు మేరకు మంగళవారం ఫుడ్ సేఫ్టీ జిల్లా అధికారి కృష్ణమూర్తి అధ్వర్యంలో ఆకస్మితంగా తనిఖీలు నిర్వహించారు.వరంగల్ నర్సంపేట ప్రధాన రహదారిపై ఉండడంతో నిత్యం దుబ్బధూళి తినుబండారాలపై పడుతున్నదని అధికారి కృష్ణమూర్తి తెలిపారు.స్వీట్ హౌస్ లో మంచినీటి సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన వాటర్ స్టోరేజ్ ఫ్రిజ్డ్ వద్దనే డస్ట్ బిన్,చేతులు కడుక్కోవడానికి అపరిశుభ్రంగా ఉన్నాయని అన్నారు.అలాగే తినుబండారాలు తయారు చేసే చేసే ప్రాంతం దుర్వాసన వెదజల్లుతూ అపరిశుభ్రంగా ఉందని అధికారి తెలిపారు.ఈ స్వీట్ హౌస్ లో నిర్వాహకులు అపరిశుభ్రంగా నిర్వహిస్తున్నట్లు గుర్తించామని దీంతో రూ. 2 వేలు జరిమానా విధిస్తూ మెమో జారీచేసినట్లు పేర్కొన్నారు.మరోసారి ఈ స్వీట్ హౌస్ తో పాటు ఇతర హోటళ్ళు,బిర్యానీ సెంటర్స్ లతో పునరావృత్తం ఐతే సీజ్ చేయక తప్పదని జిల్లా అధికారి కృష్ణమూర్తి హెచ్చరించారు.ఈ తనిఖీల్లో స్థానిక గిర్నిబావి పంచాయితీ సెక్రటరీ వైనాల రాజు తదితరులు పాల్గొన్నారు.