కిరాణా షాపులలో తూనికలు కొలతల శాఖ అధికారుల తనిఖీ.

చౌటుప్పల్ నేటి ధాత్రి :

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని పలు కిరాణా షాపులలో తూనికలు కొలతల శాఖ అధికారులు శనివారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పట్టణ కేంద్రంలోని పలు కిరాణా షాపులపై ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లా తూనికలు కొలతల శాఖ అధికారి పి.రామకృష్ణ విస్తృతంగా తనిఖీలు నిర్వహించి కిరాణా షాపులోని ప్యాకేజీలపై తయారీకేంద్రం చిరునామా, కస్టమర్ కేర్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ లేకపోవడాని గుర్తించారు. దీంతో వివిధ కిరాణా షాపులపై ఐదు కేసులు నమోదు చేసి 75 వేల రూపాయల జరిమానా విధించారు. ఈ సందర్భంగా తూనికలు కొలతల శాఖ అధికారి మాట్లాడుతూ.. వ్యాపారస్తులు తమ దుకాణాలలో డిక్లరేషన్ లేని ప్యాకేజీలు అమ్మరాదని అటువంటివి తనిఖీలలో దొరికితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా ప్యాకింగ్ చేసేవారు విధిగా ప్యాకింగ్ లైసెన్స్ తీసుకోవాలని వేయింగ్ మిషన్స్ వాడేవారు వెరిఫికేషన్ సర్టిఫికెట్లు తీసుకోవాల్సి ఉంటుందని సూచించారు. తూకంలో తేడా లేకుండా వ్యాపారం చేయాలని నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు.వినియోగదారులు కోరితే వారికి తమ వేయింగ్ మిషన్ కరెక్ట్ గా ఉందా లేదా అనే విషయాన్ని ఒకటి నుండి ఐదు కేజీల వరకు ఏదైనా బాటు పెట్టి చూపించాల్సి ఉంటుందని తెలిపారు. వినియోగదారులకు ఎటువంటి ఫిర్యాదులు ఉన్న తూనికలు కొలతల శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని లేదా వాట్సాప్ నెం. 9010651783 కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *